Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.05.2022
Share:

By Village Missionary Movement

Sunday, 29-May-2022

దిన ధ్యానము(Telugu) 30.05.2022

 

అంశం:- లోబడవద్దు.

 

"తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు; కుమారునినైనను కుమార్తెనైనను నాకంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు" - మత్తయి 10:37

 

అరే ఏంటి ఈ అంశం లోబడుటయే కదా క్రైస్తవ్యంలో మొట్టమొదటగా బోధించే అంశం వలె వింటూవున్నాం అని ఈ అంశం విన్న వెంటనే మీరనుకోనవచ్చును. పరిశుద్ద గ్రంధంలో చూసినట్లయితే చాలా సమయాల్లో చాలా విషయాల్లో క్రైస్తవుడు లోబడకూడదు అని పరిశుద్ద గ్రంధంలో వ్రాయబడి ఉన్నది. వాటిలో కొన్నింటిని ఈరోజు మనం తెలుసుకుందాం.

 

1. తల్లిదండ్రులకొరకు.

వారిని సన్మానించమని ఆజ్ఞ 10 ఆజ్ఞలలో ఒక ముఖ్యమైన ఆజ్ఞ. అలా సన్మానించినప్పుడు మనం దీర్ఘాయుష్మంతులవుతాము. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు పీకును అని పరిశుద్ద గ్రంధం హెచ్చరిస్తోంది. అదే సమయంలో ఒకడు యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారాలి అని ఆశ పడుతున్నప్పుడు తల్లిదండ్రులు తనను ఆటంక పరచినట్లయితే లేదా ప్రభువైన యేసు తన సేవకు పిలుస్తున్నప్పుడు తల్లిదండ్రులు అడ్డుకొంటే వారికి లోబడకూడదు అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. రక్షింపబడిన ఒక విశ్వాసికి మరియు రక్షింపబడని మరొక వ్యక్తికి వివాహం చేయుటకు తల్లిదండ్రులు ఏర్పాటు చేసినప్పుడు వారికి లోబడవలసిన అవరసం లేదు. యవ్వనులారా తల్లిదండ్రులను సన్మానించుడి. వారిని చక్కగా చూసుకొనండి. కాని పరిశుద్ద గ్రంధమునకు విరోధముగా ఉన్న విషయాల్లో తల్లిదండ్రుల కంటే దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. అయితే దీనిని గూర్చి వారితో కోపముగా లేదా వారిపై మండిపడకుండా ప్రేమగా వివరించి వారికి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వండి. 

 

2. అధికారుల కొరకు.

రొమా 13వ అధ్యాయంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి వుండవలెను అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. అదే విధంగా అధికారులు విధించే ప్రతి పన్నును మనం కచ్చితంగా కట్టాలి. అదే సమయంలో సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన మన ప్రభువు యొక్క ముఖ్యమైన ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించినప్పుడు దానిని అధికారుల చట్టం ఆటంక పరిస్తే ఆ చట్టానికి మనం లోబడవలసిన అవరసం లేదు. అపోస్తులకార్యం 5వ అధ్యాయంలో పేతురు మరియు ఇతర శిష్యులు సువార్తను ప్రకటించకూడదు అని అధికారులు ఆటంకపరచినప్పుడు మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా అని చెప్పుటను మేము చుస్తున్నాం. పాత నిబంధన నక్షత్రం అయిన దానియేలు కూడా ప్రార్ధించుటకు ఆటంక పరచినప్పటికి ఆయన ప్రార్ధించాడు. 

 

ప్రియమైన యవ్వనులారా లోబడవాల్సిన వాటికి లోబడి లోబడకూడని వాటికి లోబడకుండా కుడి ఎడమల తట్టు త్రోటిల్ల కుండా క్రీస్తు ఏర్పరచిన మార్గంలో నడుద్దాం. ఆమెన్.

- బ్రదర్. జె. సంతోష్ గారు

 

ప్రార్ధన అంశం:

తమిళనాడులో గల ప్రతి మండలాలలో జరుగుతున్న "ఉజ్జీవ కూటముల" కొరకు తీసుకుంటున్న ప్రయాసలను దేవుడు సఫలపరచులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet