Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.05.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 29-May-2022

దిన ధ్యానము(Telugu) 29.05.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

"బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును" - సామెతలు 19: 17

 

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారా? వెరిగూడ్. ఈరోజు కథను వినడానికి రెడీగా ఉన్నారా? నేను కూడా మీకు కధ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సరే కధ విందమా?

 

స్వీటీ అనే చిన్న పాప హోమ్ వర్క్ అంత పూర్తిచేసి నాన్న ఎప్పుడు వస్తారు అని ఎదురుచూస్తుంది. ఎందుకు అంటే నాన్నకి ఆపిల్ పండ్లు తీసుకురమ్మని చెప్పింది. పండ్ల దుకాణాలు దాటివచ్చిన తరువాత తన కూతురు ఆపిల్ పండ్లు తీసుకొని రమ్మనదని నాన్నకు గుర్తు వచ్చింది. అరే ఇలా మర్చిపోయానేంటి అని ఆలోచిస్తూ చుట్టూ తిరిగి చూసారు. రోడ్డు ప్రక్కన ఒక మామ్మ ఆపిల్ పండ్లు అమ్ముతున్నారు. ఆ రోజు ఆదాయం లేకపోవడంతో ఆమె చాలా బాధగా ఉన్నారు. అతను వెళ్లి ఒక కిలో ఆపిల్స్ ఎంత అని అడిగారు. ఆ మామ్మ 200 రూపాయలు అని చెప్పారు. తగ్గించి ఇవ్వండి అని నాన్న అడిగారు. సరే అండి 180 రూపాయలకు తీసుకోండి అని చెప్పి ఒక కిలో ఆపిల్స్ ఇచ్చారు ఆ మామ్మ. ఇతను అందులో కూడా 20రూపాయలు తగ్గించి నా దగ్గర 160 రూపాయలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. చాలా తక్కువకే ఆపిల్స్ దొరికాయి అని స్వీటీ వాళ్ళ నాన్న సంతోషంగా ఇంటికి వెళ్లిపోయారు. 

 

మరుసటి వారం ఒక పెద్ద పండ్ల దుకాణంలో ఆపిల్స్ కొనాలి అని వెళ్లారు. ఆ దుకాణదారుడు ఒక కిలో 250 రూపాయలు అని చెప్పాడు. అక్కడ బేరం ఆడటానికి అవ్వదు కాబట్టి రేటుతగ్గించలేం కదా వెంటనే ఆ మామ్మ దగ్గర కొని ఇంటికి తీసుకొని వెళదాం అని వచ్చారు. ఆరోజు మామ్మ ప్రక్కన కళ్లు కనిపించని మనవరాలు ఉండడంతో ఆ ఆపిల్స్ అమ్మి వచ్చిన ఆదాయంతోనే ఇద్దరం బ్రతుకుతాము అని మామ్మ చెప్పుటయు విన్న స్వీటీ వాళ్ళ నాన్నకు చాలా తక్కువ డబ్బులు ఇచ్చి ఆ మామ్మ దగ్గర ఆపిల్ పండ్లుకొనుట గుర్తు తెచ్చుకున్న ఆయన చాలా బాధపడ్డారు. మనకు ఈ 40 రూపాయలు పెద్ద లెక్కకాదు కాని ఆ మామ్మకు అదే వారి జీవితం కాబట్టి ఇకపై ఇలా చిన్నచిన్న వ్యాపారుల యొద్ద 5, 10 రూపాయలకు బేరం ఆడకూడదు అని నిర్ణయించుకున్నారు. అ తరువాత నుండి ఆ మామ్మ దగ్గరే ఆపిల్ కొంటాను అని నిర్ణయించుకున్నారు. తన బంధువులకు మరియు స్నేహితులకు ఆ మామ్మను పరిచయం చేసారు. ఆ మామ్మ చాలా సంతోష పడ్డారు. 

 

ఏంటి ఫ్రెండ్స్ కథ విన్నారు కదా. మనం ఎవరిని మోసం చెయ్యకూడదు. పేద స్థితిలో వచ్చే ఆదాయం పైన ఆధారపడి బ్రతికేవాళ్లను చూస్తే వారి మీద కనికరపడి వాళ్లకు సహాయం చెయ్యాలి. వాళ్లకు చేసే సహాయం మన ప్రభువైన యేసుక్రీస్తుకు చేసిన సహాయం వంటిది అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది కదా. సరే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకుందామా. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al