By Village Missionary Movement
Thursday, 26-May-2022దిన ధ్యానము(Telugu) 26.05.2022
అంశం:- క్రీస్తులో ఆశక్తి.
"నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే" - గలతియులకు 4:18
అపోస్తులుడైన పౌలు ఏథెన్స్ పట్టణంలో తన తోటి సేవకుల కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండి యుండుట చూసినప్పుడు అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి యేసును గూర్చి ఆయన పునరుత్థానమును గూర్చి ఆ పట్టణస్తులకు ప్రకటించడం ప్రారంభించాడు. పౌలు చెప్పిన మాటను అంగీకరించి విశ్వసించారు అని చదువుతున్నాం. ఎన్ని సార్లు మనం మన యొక్క అనుదిన జీవితంలో ఎన్నో విగ్రహ గుడులను చుస్తున్నాం. అవి మనకు మేలు చేస్తాయి అని వాటిని వెంబడిస్తున్న ప్రజలను కన్నులారా చుస్తున్నాం. ఈ పరిస్థితులలో మనం ఎన్ని సార్లు ఆత్మలో దుఃఖ పడి వారు కూడా మార్పు చెందాలి అని ఎంత మందికి యేసుక్రీస్తును గూర్చి ప్రకటించాం. మన యొక్క ఆశక్తి ఎలా ఉంది? క్రైస్తవుడు అనే దుప్పటిని కప్పుకొని ఒకే సంఘంలో లేదా ఒక సంస్థలో ఉండి దానినే పట్టుకొని ఆశక్తి చూపే వారిలా ఉన్నామా? లేదా క్రీస్తు శరీరంలో ఒక భాగంగా ఉండి నిజమైన క్రైస్తవుల వలె బ్రతుకు తున్నమా? ఈరోజు క్రైస్తవులైన మనము యేసుని పేరులో ఎన్నో భాగాలుగా విభజింపబడి ఉన్నాం. మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే. నేను ఈ సంస్థకు చెందిన వాడను మీరు ఆ సంస్థకు చెందిన వారు అనే విభజన క్రైస్తవ ప్రజలలోనే ఏర్పడి విశ్వాసం తగ్గుతూ ఉండడం చూడగల్గుతున్నాం. ఇటువంటి విభజనలలో ఆశక్తి చూపుట విడిచి క్రీస్తు కొరకు ఆశక్తి చూపేవారిలా బ్రతుకుదాం. ప్రజలు నిజమైన దేవున్ని ఎరుగక విగ్రహముల ద్వారా కట్టబడి యున్నారు అని పౌలు పరితపించినట్లే ప్రభువైన యేసుని ఎరుగని ప్రజల కొరకు మనం పరితపించి వారియెడల ఆశక్తి చూపుదాం. శారీరక ఆశక్తిని విడిచిపెడదాం సువార్తను నాటుదాం. దేవుని రాజ్యమును కట్టుటకు విశ్వాసములో ఐక్యం అవుదాం.
- శ్రీమతి. సైమిక మోసెస్
ప్రార్థన అంశం:
ప్రతి మండలములో 300 మంది గిద్యోను లు లేచేలా, వీరు ఒక గంట ప్రార్ధించేవారిలా, సేవచేసేవారిలా వారిని సమర్పంచుకొనులాగున ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250