By Village Missionary Movement
Wednesday, 25-May-2022దిన ధ్యానము(Telugu) 25.05.2022
అంశం:- దురాశ.
"నాబోతు చనిపోయెనని అహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకొనబోయెను" - 1రాజులు 21:16
హత్య చేసినంత ఘోరమైన పాపములలో దురాశ అనేది ఒకటి. మనకు కలిగిన వాటితో సంతృప్తి పొందకుండా ఇంకా ఆస్తి అంతస్తులు సంపాదించాలి అని పరిగెత్తకూడదు. జీవిత పరుగు అనేది తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు జీవితమును నాశనమునకే తీసుకొని వెళ్తుంది. దానినే అహాబు రాజు యొక్క జీవితంలో చూడవచ్చు.
నాబోతు యొక్క ద్రాక్షతోట అహాబు రాజా నగరకు ఆనుకొని ఉండేది. ఆ తోటను తనకు సొంతం చేసుకొని కూర తోటగా మార్చాలి అని అహాబు అనుకున్నాడు. కాని నాబోతు తన పితురుల యొద్దనుండి పొందుకొన్నది కాబట్టి ఆహాబునకు ఇచ్చుటకు ఇష్టపడలేదు. ఈ సంగతి విన్న అహాబు భార్య అయిన యెజెబేలు నాబోతును మోసపూరితంగా చంపించింది. నాబోతు చనిపోయిన సంగతి విన్న అహాబు నాబోతు యొక్క ద్రాక్షతోటను స్వాధీన పరుచుకొనబోయెను అని యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకేనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని ఆహాబుతో చెప్పమని చెప్పెను. అహాబు తనకున్న ఎన్నో ద్రాక్షతోటలలో ఒక తోటను కూర తోటగా మార్చి అనుభవించవచ్చు. అలా చెయ్యకుండా నాబోతు యొద్ద ఉన్న ఒక్క ద్రాక్ష తోటను నాబోతును చంపి మరి స్వాధీన పరుచుకున్నాడు. ఈ ఆశ దురాశగా మారింది. చివరిగా అహాబు కుటుంబం మరియు తన సంతతి వారు అందరూ నశించి పోయారు.
దీనిని చదువుతున్న ప్రియమైన సహోదరి సహోదరుడా! మీ యొద్ద చాలా ఆస్తులు ఉన్నా సరే ఇతరుల ఆస్తుల కొరకు ఆశ పడుతున్నారా? ఎలాగైనా వాటిని పొందుకోవాలి అని మోసకరముగా ఆలోచిస్తున్నారా? అహాబు మరియు యెజెబెలు మేము రాజా రాణిలము మేము ఏం చేసినా అడిగేవారు లేరు అనే అహంకారంతో ఇటారులను ప్రక్కకు త్రోసివేసే వారివలె మీరు కూడా త్రోసివేసేస్తున్నారా? జాగ్రత్తగా ఉండండి. ప్రభువైన దేవుడు వారి పక్షమున మీతో వాదిస్తారు. మీరు మాత్రమే కాదు మీ సంతతి వారు కూడా బాధింప బడతారు. మీరు కూడా నిత్య నరకంలో త్రోసివేయబడతారు. దేవుడు మిమ్మును గూర్చి న్యాయం తీర్చుతారు. దురాశ దుక్కానికే చేటు అనేది లోక భాష. కాని దురాశకు ప్రభువైన యేసు ఇచ్చే దండన చాలా పెద్దది. మనం ఈ దూరాశను త్రోసివేసి మనం దేవుని చెంతకు తిరుగుదాం మనము మన కుటుంబం ఆశీర్వాదం పొందుకుందాం.
- శ్రీమతి. భువనా ధనబాలన్ గారు
ప్రార్థన అంశం:
వి.యమ్.యమ్ పరిచర్య మూలముగా ప్రత్యేకముగా యవ్వన స్త్రీల కొరకు బయలుపరుస్తున్న మ్యాగజైన్ ద్వార అనేక మంది యవ్వనులు క్రీస్తు ప్రేమను యెరిగేలా ప్రార్ధిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250