By Village Missionary Movement
Tuesday, 24-May-2022దిన ధ్యానము(Telugu) 24.05.2022
అంశం:- ప్రార్థన జీవితం.
"ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను" - మార్కు 1:35
హే మిల్ టర్ అనే బైబిల్ కాలేజీలో సీనియర్ సేవకుడైన బకాస్ అనే అతను మరణపు అంచులలో ఉన్నారు. డాక్టర్లు బకాస్ ను పరీక్షించి హాస్పిటల్ ద్వారం యొద్ద నిలబడి ఉన్న తన స్నేహితులతో నెమ్మదిగా ఏదో చెప్పి వెళ్లిపోయారు. డాక్టర్లు వెళ్లిపోయిన వెంటనే పడకలో ఉన్న బకాస్ తన స్నేహితులను చేతులాడిస్తూ పిలిచి డాక్టర్లు ఏం చెప్పారో దాచిపెట్టకుండా దయచేసి నాతో చెప్పండి అని అడిగారు. అందుకు తన స్నేహితులు అరగంటకు పైగా ప్రాణములతో ఉండలేరు అని బిగ్గరగా ఏడుస్తూ చెప్పారు. బకాస్ వెంటనే అలా అయితే నన్ను ఈ పడక నుండి లేపి మోకాళ్ళ పైన నిలబెట్టటండి. నా జీవిత చివరి క్షణాలు మోకాళ్లపైన ముగియనివ్వండి అని అన్నారు. అతని కోరిక మేరకు అలానే మోకాళ్లపైన తన జీవితాన్ని ముగించారు. చాలా సంవత్సరాలుగా తాను పాటించిన ప్రార్థన అలవాటును ప్రాణము పోయే చివరి క్షణాల్లో కూడా తప్పిపోకుండా పాటించారు.
యేసుక్రీస్తు ఈ భూమిపైన బ్రతికిన దినాల్లో చాలా స్థలములో చాలా సమయాల్లో ప్రార్ధించారు. తన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాలు సేవ యొక్క విజయ రహస్యమే ఆయన యొక్క ప్రార్ధన జీవితం. ఆయన తన శిష్యులకు కూడా ప్రార్ధన నేర్పించారు. యేసుక్రీస్తు తనను అప్పగించు కొనుటకు ముందు గెత్సేమనే తోటలో కన్నీటితో ప్రార్ధించారు. శిష్యులతో అనేకమంది ప్రజలతో ఉన్నప్పటికీ తండ్రితో కలిగిన సంబంధమును నూతన పరుచుకొనుటకు ఒంటరిగా వెళ్లి ప్రార్ధించేవారు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మన యొక్క ప్రార్ధనా జీవితమునకు గొప్ప ప్రాముఖ్యమైన మాదిరి యేసుక్రీస్తే. ఆయన ప్రార్ధించి సేవమార్గంలో విజయం సాధించారు. ప్రార్ధన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మనకు ఉన్న సంబంధమును నూతన పరచుకొనుటయే. ప్రార్ధన క్రైస్తవులమైన మనకు ఊపిరి వంటిది. ప్రార్థన మీకు అలవాటుగా మారినప్పుడు అద్భుతములు మీ జీవన శైలిగా మారుతాయి. మనం చేసే ప్రార్ధన క్రీస్తుతో కలిగి ఉన్న సంబంధమును నూతన పరుచునది గాను మరియు మెరుగు పరుచునది గాను వుండనివ్వుడి.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:
సేవకుల కొరకు బయలుపరుస్తున్న పత్రికలు పంపించుటకు పోస్టల్ అనుమతి (Postal Permit) దొరికేలా ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250