By Village Missionary Movement
Monday, 23-May-2022దిన ధ్యానము(Telugu) 23.05.2022
అంశం:- మంచితనము.
"సమాధానపరచువారు ధన్యులు ; వారు దేవుని కుమారులనబడుదురు" - మత్తయి 5:9
ఒక క్రైస్తవ కుటుంబంలో బావ మరియు బావమరిది మధ్యలో ఇల్లు కట్టే విషయంలో ఒక చిన్న అభిప్రాయ భేదం ఏర్పడింది. ఇద్దరు సహజముగా మాట్లాడు కొనుటయు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లుటయు ఆపివేశారు. చర్చి లో లేదా బయట ఎక్కడైనా కలిసినప్పుడు ఒకరిని ఒకరు పట్టించుకోకుండా వెళ్లిపోయేవారు. ఇల్లు పని జరుగుతూనే ఉంది అందులో ప్లమ్ బింగ్ వర్క్ జరిగుతుంది. యేసుక్రీస్తు ను ఎరుగని ఒక వ్యక్తి ఆ పని చేయుటకు పిలువబడ్డాడు. ఇతనికి బావ మరియు మరిది ఇద్దరు తెలుసు. అతడు వీరి సమస్యను ఏరిగిన వాడై ఆ సమస్యను సరిచేయ్యాలి అనుకున్నాడు. అందుకు అతను చేసింది ఏమిటి అంటే బావతో మాట్లాడినప్పుడు తప్పు మీ మరిదిది కాదు మీరే అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అలాగే మరిదితో మాట్లాడి నప్పుడు తప్పు మీ బావది కాదు మీరు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని చెప్తువచ్చారు. ఈవిధంగా అతను ఒక నెల అంత చేస్తూ వచ్చాడు. చివరిగా ఇద్దరి మధ్య సమాధానం ఏర్పడింది. మరల ఇద్దరు ఒక్కటయ్యారు. యేసుని ఎరుగని ఈ వ్యక్తి ప్రయత్నం మరియు తన యొక్క మంచి గుణం నిశ్చయముగా ఆశ్చర్యకరమైనది.
పరిశుద్ద గ్రంధంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈవిధంగా చెబుతున్నారు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు అని. పాత నిబంధనలో ఏశావు, యాకోబు గూర్చి చదువుతున్నాం. యాకోబు మొదట మోసం చేసే వాడిగా ఉన్నప్పటికీ ఆ తరువాత రోజుల్లో యాకోబు సమాధానమును ఆశించే వాడిగా తన సహోదరునితో ఒకటవ్వాలి అని ఆశించే వాడిగా ఉన్నాడు. మొదట తాను ఏశావును మోసం చేసి ఆశీర్వాదం పొందుకొన్నప్పటికి దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పుడు దానిని ఏశావుకు పంచి ఇచ్చుటకు ఆశ పడ్డాడు. ఇదే దేవుడు ఆశించే సమాధానం.
అవును ప్రియమైన వారలారా! ఈరోజుల్లో మనం ఎదుర్కొంటున్న మన స్థితి ఏమిటి. మనం పగతో దేవునికి చెల్లించిన కానుకలు కూడా అంగీకరింప బడవు అని పరిశుద్ద గ్రంధం చెబుతుంది. కావున సమాధానము ఆశించి దానిని పొందుకుందాం. ఇతరులను సమాధానములో నడిపిద్దాం. దేవుని కుమారులవుదాం.
- బ్రదర్. థామస్ గారు
ప్రార్థన అంశం:
మోక్ష ప్రయాణం దినధ్యాన పత్రికలను చదువుతున్నవారు సత్యములో ఎదిగి, సాక్షులుగా జీవించులాగున ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250