Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.05.2022
Share:

By Village Missionary Movement

Sunday, 22-May-2022

దిన ధ్యానము(Telugu) 22.05.2022

 

అంశం:- నూతన జీవితం

 

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" - 2 కోరింథీయులకు 5:17

 

హలో! పిల్లలు ఎలా ఉన్నారు? ఈ రోజు మనం నూతన జీవితం అనే అంశం పై స్కాట్లాండ్ దేశంలో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం. స్కాట్లాండ్ దేశంలో ఒక పాత ఆలయం ఉండేది. అది చూడటానికి అందంగా సూపర్ గా ఉంటుంది. కాని చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఆలయానికి వచ్చేవారు. బెంచ్ అనే ఒకతను మాత్రం అక్కడ ఉన్న దూళిని తుడిచి శుభ్రపరచి ప్రేయర్ ను నడిపిస్తాడు. కాని పైన ఉన్న పటాన్ని ఎవరు శుభ్రపరిచేవారుకాదు. అది ఏ పటమో కూడా తెలియలేనంతగా దూళి పట్టి ఉండడంతో . దానిని శుభ్రపరచటం చాలకష్టం అని చెప్పి ఎవరూ కూడా దానిని శుభ్రపరిచేవారుకాదు. ఆ సమయంలో ఒక టీమ్ ఆ ఆలయమునకు వెళ్ళి ఒక వారం అక్కడ నివాసం ఉండి ఆ ఆలయం అంతా శుభ్రపరచాలి అని నిర్ణయించుకుంది. పైన ఉన్న పఠమును చూసి ఈ పఠమును తీసి క్రింద పడేద్దాం అ చెప్పినప్పుడు ఇంకొకతను ఇది ఏ పటమో చూద్దాం అని చెప్పి దూళిని దులిపి నీళ్ళతో కడిగి శుభ్రపరిచి ఒక వస్త్రముతో తుడిచి చూస్తే అందమైన పఠములా కనిపించింది. అది ఏ పటమో అని చూసినప్పుడు యేసుక్రీస్తు చివరిగా రొట్టె మరియు ద్రాక్షారసము ఇస్తున్న పఠము ఈ పఠమును ఎవరు చిత్రీకరించారు అని తెలుసుకున్నప్పుడు లోకంలో ప్రసిద్ధి గాంచిన మైఖేల్ ఆంజెలో గీసిన పఠము అని అందరూ ఆశ్చర్య పడ్డారు. ఇది ఎంతో ఖరీదైనది. దీని విలువ యాభైకోట్లకు పైగా ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది అని దానిని ఆలయంలో అతికించారు. 

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి మనలో కూడా విలువైన నశించని ఆత్మ ఉన్నది. అబద్ధం చెప్పటం, దొంగతనం చేయటం, భూతులు మాట్లాడటం, లోబడకపోవడం. ఇటువంటి అనేకమైన పాపపు ధూలి మన అందమైన విలువైన ఆత్మను మూసివేసి ఉన్నది. ఇందుకొరకే యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చి రక్తము కార్చారు. ఆయన రక్తమే పాపపు ధూలిని కడిగి ఆత్మ ను శుభ్రపరిచి మనలను నూతన సృష్టిగా మారుస్తుంది. అది మాత్రమే కాదు యేసుని రక్తం ద్వారా కడగబడినప్పుడు మనం విలువైన వారిగా మారతాం. ఏంటి పిల్లలు యేసులో నూతన సృష్టిగా మారుటకు రెడీయేనా? వెరీ గుడ్ సరే పిల్లలు ఇప్పుడు మనం యేసుని రక్తం లో కడగబడి నూతన సృష్టిగా మారాలని నేర్చుకున్నంకదా! ఇప్పుడు మనం ఒక కంఠత వాక్యం నేర్చుకుందామా?

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş