By Village Missionary Movement
Friday, 20-May-2022దిన ధ్యానము(Telugu) 20.05.2022
అంశం:- కనికరం.
"ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను" - మత్తయి 14:14
దేవుని ప్రేమ వలన తాకబడి రక్షణ పొందుకున్న ఒక సహోదరి తనను ముట్టిన ఆ దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి అని ఆశక్తితో ప్రార్థిస్తున్నది. ఆమె ఉన్న ఊర్లో ఒక ముసలావిడ నయంకాని వ్యాధితో బాధపడుతూ తన కుటుంబీకులతో మరియు ఇరుగుపొరుగు వారితో తృణీకరింపబడి ఊరు బయట ఏకాంతముగా ఉన్న చిన్న ఇంట్లో బంధువుల ద్వారా త్రోసివేయబడిన పరిస్థితుల్లో రోజులు లెక్కిస్తుంది. ఈ వార్తను విన్న ఆ సహోదరి ప్రతి ఫలాన్ని ఆశించకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ముసలావిడకు సహాయం చేసింది. కుళ్ళిన పుండ్ల యొక్క దుర్వాసన పట్టించుకోకుండా ఆ పుండ్లను శుభ్రపరచి గాయములను కట్టి కావలసిన ఆహారాన్ని ఇచ్చి ఆమెను చూసుకొంటున్న ఈ సహోదరికి ప్రశంసలు కలుగలేదు గాని అనారోగ్యం కారణంగా బాధలో మాటిమాటికి స్వార్థం కలిగించే ఆ ముసలావిడ యొక్క సణుగులాట మాత్రమే ఆ సహోదరి దక్కింది. కాని కనికరముతో ఆ సహోదరి ఆ సేవను చేస్తూ వచ్చింది.
యేసుక్రీస్తు గొప్ప సమూహమును చూసి వారిమీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థ పరిచారు. నాయీనను అనే ఊరి విధవరాల యొక్క కుమారుడు చదివినప్పుడు ఆమె జీవితంలో నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో యేసు ఆమె యందు కనికరపడి ఏడవ వద్దు అని చెప్పి దగ్గరకు వెళ్ళి పాడెను ముట్టి మరణించిన వానిని లేపాడు.
హెన్రీ న్యూ మ్యాన్ అనే వేదాంత వేత్త కనికర పడటం చాలా కష్టం ఎందుకనగా అది ఇతరుల భావోద్వేగాలు గుండా వెళుతుంది. వారు బలహీనంగా ఉన్నప్పుడు, ఒంటరితనంలో మనస్సు పగిలిన సమయంలో మనం వారి పరిస్థితులు గ్రహించి నడుచుకోవాలి అని చెప్పారు. గాయపడిన పక్షినో లేదా ఒక చిన్న వాడు క్రింద పడుట చూడటం కనికరం కాదు అది పరితపించే భావోద్వేగం అవుతుంది. కనికరం అనేది క్రియల ద్వారా బయలుపడాలి . అందుకే యేసుక్రీస్తు గొప్ప సమూహమును చూసినప్పుడు వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని కనికరించారు. రక్షకుడు లేని ప్రజలను చూసినప్పుడు మన హృదయం పగులుతుందా? ప్రసిద్ధి పేరు గాంచిన భైరన్ ప్రభువు అనే అతను కనికరం అనేది కన్నీటితో బైలు పడుతుంది అని చెప్పారు. గాయపడిన మనుష్యులను చూసి మనం దేనిని బయలుపరుస్తున్నాం? దేవుని యొక్క కనికరమును పొందుకున్న మనం మిగతా వారికి దానిని చూపించే విధంగా ఉండాలి.
- శ్రీమతి. వసంతి రాజమోహన్
ప్రార్థన అంశం:
ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి 6:30 వరకు యవ్వన స్త్రీల కొరకు టీవీ మరియు యూట్యూబ్ లో బయలుపరుస్తున్న కార్యక్రమాల ద్వారా అనేక మంది యవ్వనులు తాకబడేలా ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250