Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.05.2022
Share:

By Village Missionary Movement

Thursday, 19-May-2022

దిన ధ్యానము(Telugu) 19.05.2022

 

అంశం:- విశ్వాసం.

 

"విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము" - హెబ్రీయులకు 11:6

 

సముద్ర తీరంలో జీవిస్తున్న మీనా కుటుంబం జాలరి పనిని నమ్మి జీవిస్తుంది. ప్రతి వారం సండే క్లాస్ చెప్పడానికి వచ్చిన అక్క మాటలను మీనా విశ్వసించి నడుచుకొనేది. ఒక రోజు తన తండ్రి కొంతమందితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి రాలేదు ఒక రోజు మరియు రెండు రోజులు గడిచాయి కాబట్టి ఊర్లో ఉన్న వారు మీనా కుటుంబాన్ని ఓదార్చుటకు వచ్చారు. కాని మీనా మాత్రం నాన్న వస్తారు అని విశ్వసించి ఎదురు చూస్తూ ఉంది. ఒక రోజు పడవ వచ్చింది అందులో మీనా వాళ్ళ నాన్న కూడా వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు మీనా యొక్క విశ్వాసాన్ని ఘనపరిచారు. 

 

రాహాబు అని పేరు గల ఈమె ఒక వేశ్య. యెహోషువ యెరికోను వేగు చూచుటకు ఇద్దరు మనుష్యులను పంపించారు. రాహాబు వారికి సహాయం చేసింది. రాజు మనుష్యులను పంపి వారిని బయటకు తీసుకు రమ్మని చెప్పాడు కాని రాహాబు వారిని దాచిపెట్టి తాడు సహాయముతో వారిని ఆ ప్రకారము నుండి దించి యెరికోను నాశనం చేయునప్పుడు నన్ను మరియు నా తండ్రి ఇంటి వారిని నాశనం చెయ్యవద్దు అని వేడుకొంది. దానికి అనవాలుగా ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టింది. యెరికో నాశనం చేయబడినప్పుడు విశ్వాసమునకు ఫలముగా రాహాబు మరియు ఆమె కుటుంబం నాశనం అవ్వకుండా కాపాడబడ్డారు. ఆమె యెహోవా మీద ఉంచిన విశ్వాసమును బట్టి విశ్వాసులు జాబితాలో చోటు దక్కించుకొంది. అది మాత్రమే కాదు లోక రక్షకుడైన యేసుక్రీస్తు కూడా రాహాబు సంతతిలోనే పుట్టారు. 

 

ప్రియమైన వారలారా! మన యొక్క విశ్వాసపు పరిమాణం ఎటువంటిది. దేవుని పైన విశ్వాసం ఉంచి మనకు కావలసిన వాటిని పొందుకొంటున్నామా? హెబ్రీ 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరులను గూర్చి మనం చదువుతున్నాం. వారందరూ విశ్వాసం ద్వారా లోకాన్ని జయించారు. అదే అధ్యాయం చివరి భాగంలో వారు శ్రమలు అనుభవించడం గురించి రాయబడించి. అవును నశించే బంగారం కంటే విలువైన మన విశ్వాసం శోధింపబడి యేసు క్రీస్తు బయలుపడినప్పుడు మీకు కీర్తి ఘనత కలుగుతుంది. అందువలన విశ్వాసం విడిచిపెట్టవద్దు. నిశ్చయముగా అద్బుతమును చూస్తారు.

- శ్రీమతి. ఎస్తేర్ గాంధీ గారు

 

ప్రార్థన అంశం:

ప్రతినెల టీవీ లో ప్రచురిస్తున్న కార్యక్రమాలకు 9లక్షలు అవసరమై యున్నవి, టీవీ కార్యక్రమాలను సహకరించే భాగస్వాములను దేవుడు ఏర్పరచులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş