By Village Missionary Movement
Wednesday, 18-May-2022దిన ధ్యానము(Telugu) 18.05.2022
అంశం:- యుద్దము యెహోవాదే.
"అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను" – 1 సమూయేలు 17: 47
వార్త పత్రికలలో క్రూరముగా ప్రవర్తించే వారిని గూర్చి చదివి ఉంటాం. ఇలా చాలా సంఘటనల వలన మన దేశంలో చాలా మంది యవ్వన స్త్రీలు, చిన్న పిల్లలు లైంగిక హింసలతో బాధింప బడుట గుర్తు చేసుకున్నప్పుడు మన గుండె పగిలిపోతుంది కదా! మనుష్యులలో ఇంత క్రూరముగా ఉంటారా అని కోపం రగులుతున్నది కదా! ఇంకా చెప్పాలి అంటే సామాజిక రుగ్మత కారణమైన వారు దండన అనుభవించిన సరే కోల్పోయిన ఆడపిల్లల కుటుంబం ఎలా సహించ గలుగుతుంది. అది ఓర్చు కోలేని గొప్ప విషాదం.
పరిశుద్ద గ్రంధంలో దావీదు మరియు సౌలు యొక్క సంభాషనను 1 సమూయేలు 17 వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో సౌలు అనే దానిని 17 వ అధ్యాయం 33వ వచనంలో చుస్తున్నాం. అందుకు దావీదు సౌలుతో చెప్పిన కార్యం చాలా అద్బుతమైనది. అదేమిటి అంటే నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును, ఎలుగుబంటి వచ్చి మందలోనుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకు పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొర్రె పిల్లను విడిపించితిని అని చెప్పాడు.
ప్రియమైన వారలారా! దావీదు వలె మనం కూడా ధైర్యంగా నడుచుకొంటున్నామా? క్రూర మృగముల నోటిలోనుండి దేవుని బలముతో దావీదు తన గొర్రెను కాపాడినట్లే మనము కూడా క్రూరమైన మనుష్యుల నోటిలోనుండి ఆడపిల్లను కాపాడాలి. అందుకొరకు మనము కష్టపడాల్సిన అవసరం లేదు మనము ప్రార్థిస్తే మన దేశంలో జరిగే ఈ పరిస్థితులు మారతాయి. ఆత్మలు క్రీస్తు చెంతకు చేర్చబడతాయి. మనం మనలను తక్కువగా అంచనా వేసుకొని విరోధి అయిన సైతానును చూసి భయపడుతున్న వారి వలె ఉన్నామా? యుద్దము యెహోవాదే అని దావీదు చెప్పిన విధముగా మనము కూడా యుద్ధ భూమిలో ఉంటే చాలు మనలో యెహోవా ఉండి యుద్దము చేస్తారు. దేశము యొక్క క్షేమము కొరకు మోకాళ్ళ యుద్ధం చేద్దాం విజయం పొందుకుందాం.
- బ్రదర్. అనిష్ రాజ్
ప్రార్థన అంశం:
మీడియా మినిస్ట్రీలో పనిచేస్తున్న సేవకులను దేవుడు ప్రత్యేకమైన ఆత్మతో నింపి వాడుకునేలా ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250