Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.05.2022
Share:

By Village Missionary Movement

Monday, 16-May-2022

దిన ధ్యానము(Telugu) 16.05.2022

 

అంశం:- స్వేచ్ఛ కలిగిన పక్షి.

 

"యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండ నిమ్ము, నీ కోరికచొప్పునను నీ దృష్టియొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటి నిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపక ముంచుకొనుము" - ప్రసంగి 11:9

 

సలహాలు అవి మాకు నచ్చవు. మాకు నచ్చిన విధముగా ఉండుటకు మాకు స్వతంత్రము లేదా మేము చేసే ప్రతి పనిని అడ్డుకున్నారు, మేము ఇంకా చిన్న పిల్లలమా? మా తరం వేరు మీ తరం వేరు కాబట్టి మాటిమాటికి విసికించకండి, ఇదే యవ్వనస్తులు ఉండే ప్రతి ఇంట్లో ఎదిరిస్తూ అడిగే ప్రశ్నలు. దీనినే ఒక్క మాటలో (generation gap) అనగా తరానికి తరానికి మధ్య ఉన్న తేడా అని చెబుతున్నాం. 

 

పరిశుద్ద గ్రంధం కూడా యవ్వనస్తులకు స్వతంత్రము ఇచ్చింది. యవ్వనుడ నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము అయితే వీటన్నింటి బట్టి దేవుడు తీర్పు లోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని చెబుతుంది. నా కుమారులారా ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దానిని నీవు పొంది యుండుము అని సామెతలు 4:13వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తప్పిపోయిన చిన్న కుమారుని ఉపమానములో సలహాను ఇష్టపడని తను తండ్రి సమక్షంలో నుండి తొలగి స్వేచ్ఛగా బ్రతకాలి అని అనుకున్నాడు. ఆస్తిలో తన భాగం తీసుకొని దూర దేశమునకు స్వేచ్ఛ కలిగిన పక్షిలా ఎగిరి వెళ్ళిపోయాడు. చివరిలో ఏం జరిగిందో మీకే తెలుసు. అదే విధంగా తన కన్నుల కోరిక వలన మనస్సు చెప్పే విధంగా నడిచిన సమ్సోను జీవితం చివరికి ఏం జరిగిందో మీకు తెలిసిన విషయమే. 

 

ప్రియమైన యవ్వనులారా! మనకు నచ్చి ఇష్టపడి జీవించిన జీవితంలో స్వాతంత్ర్యము లేదు. తనకు తాను క్రీస్తు శ్రమలకు అప్పగించు కొనిన వాడు అన్నింటిలో పరిపూర్ణ స్వాతంత్ర్యము కలవాడు. క్రీస్తుకి సేవకునిగా అప్పగించు కొనువాడు అన్నింటిలో స్వాతంత్ర్యము కలవాడు. మన కంటి ముందు ఉండే సమస్తమును అనుభవించే అధికారం మనకు ఉంది అయితే అన్నింటినీ అనుభవించే అర్హత మనకు లేదు అని గ్రహిద్దాం. స్వాతంత్ర్యము అనే ఆకాశంలో ఎగురుతూ పాపపు గాలిని శ్వాసించి దారి తప్పి నడిచినట్లయితే సాతాను కన్నులకు ఆహారంగా అవుతాము. మద్యపానం, ధూమపానం, వ్యసనం, సినిమా, హింస, వ్యభిచారం వంటి పాపపు బానిసత్వం నుండి క్రీస్తు యేసు యొక్క విలువైన రక్తం ద్వారా విడుదల పొందుకొనుటయే నిజమైన స్వాతంత్ర్యము. పరిశుద్ద గ్రంథ వాక్యము మరియు తల్లిదండ్రుల సలహాలు రెండు రెక్కల వలె మారి నప్పుడు సురక్షితంగా ఎగురగలం.

- సహోదరి. ఆర్. గ్రేస్

 

ప్రార్ధన అంశం:

ప్రతిరోజు ఉదయం 5గంటలకు యూట్యూబ్ లైవ్ లో వస్తున్న హీలింగ్ సర్వీస్ లో పాల్గొంటున్న వ్యక్తులు స్వస్థత పొందుకొనులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş