Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.05.2022 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 15-May-2022

దిన ధ్యానము(Telugu) 15.05.2022 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

అంశం:- మంచిని విత్తు మంచినే కొస్తావు

 

"మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును" - గలతియులకు 6: 7

 

ఒక ఊర్లో ఒక కలప వ్యాపారి వున్నాడు. ఆ దుకాణం పక్కన ఇంకొక ఇనుము వ్యాపారి కూడా ఇనుము దుకాణం పెట్టాడు. ఈ ఇద్దరు వ్యాపారులు స్నేహితులుగా మారి వ్యాపారం చేస్తూ ఉన్నారు. కలప వ్యాపారి యొక్క వ్యాపారంలో ఎక్కువ లాభం కలగడంతో ఇనుము దుకాణమును కూడా దోచుకోవాలి అని ఆశ కలిగింది. ఒక రోజు ఇనుము వ్యాపారి తన కుటుంబంతో కలిసి పిక్ నిక్ కు వెళ్ళాలి అని అనుకున్నాడు. తన దుకాణాన్ని తన స్నేహితుడైన కలప వ్యాపారికి బాగా చూసుకోమని చెప్పి అప్పగించాడు. ఈ కలప వ్యాపారి ఆ ఇనుము వ్యాపారి వచ్చే లోపు అక్కడ ఉన్న ఇనుము సామాన్లు అన్ని అమ్మివేసి ఏమి తెలియని వాడిలా వున్నాడు. పిక్ నిక్ కు వెళ్లిన ఇనుము వ్యాపారి సంతోషంగా ఇంటికి వచ్చి దుకాణమును చూస్తే అక్కడ ఒక్క సామాను కూడా లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. వెంటనే ఆ కలప వ్యాపారిని పిలిచి అడిగాడు. అతడు మాత్రం ఎలుక తినేసింది అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు. ఇద్దరి పైన కేసు నమోదు చేశారు. ఆ కేసును రాజు యొద్దకు తీసుకొని వెళ్లారు. రాజు గారు కలప వ్యాపారి చెప్పినది నమ్మినట్లు నటించారు. రోజులు గడిచాయి కొన్ని నెలలు తరువాత మరల ఇనుము వ్యాపారి తన సొంత ఊరికి పండుగకు వెళదాం అని పిలిచాడు. కాని ఆ కలప వ్యాపారి వెళ్ళలేదు. కనీసం మీ కుమారుడ్ని అయిన పంపించు అని ఆ ఇనుము వ్యాపారి అడిగాడు. అందుకు కలప వ్యాపారి ఒప్పుకున్నాడు. తనకు ఉన్న ఒకే ఒక కుమారుడ్ని ఆ ఇనుము వ్యాపారితో పంపించాడు. అందరూ సంతోషంగా వెళ్లి పండుగ జరుపుకున్నారు. పండుగ అయ్యాక తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కలప వ్యాపారి వాళ్ళ కుమారుడు రాకపోవడంతో చాలా భయపడ్డాడు. నా కుమారుడు ఎక్కడ వున్నాడు అని ఇనుము వ్యాపారిని అడిగాడు. అందుకు ఆ ఇనుము వ్యాపారి కుమారుడ్ని గ్రద్ద తీసుకొని వెళ్ళిపోయింది అన్నాడు. వెంటనే ఆ కలప వ్యాపారి 10 సంవత్సరాలు వయస్సు ఉన్న నా కుమారుడ్ని గ్రద్ద ఎలా తీసుకొని వెళ్లగలిగింది అని ఏడ్చాడు. ఈ సారి కూడా ఈ కేసు అదే రాజు యొద్దకు వెళ్ళింది. ఆ రాజు ఇనుమును ఎలుక తినగలిగితే నీ కుమారుడ్ని కూడా గ్రద్ద తీసుకొని వెళ్ల గలదు కదా? అని తీర్పు తీర్చాడు. కలప వ్యాపారి ఏడుస్తూ తన తప్పును ఎరిగి రాజుగారి కాళ్లపైన పడి నేను తప్పు చేశాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఇనుము అమ్మేసిన డబ్బును రాజు యొద్ద అప్పగించాడు. 

 

ప్రియమైన తమ్ముడు చెల్లి మీరు కూడా ఇతరులకు ఏం చేస్తారు అదే మీ జీవితంలో తిరిగి జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోకండి. ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయడం అలవాటు చేసుకోండి. సరేనా?

శ్రీమతి. అనిత అలగర్ సామి గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al matbet matbet giriş hepsibet hepsibet giriş betnano betnano giriş betparibu betparibu giriş casibom virüsbet pashagaming kalebet perabet pashagaming virusbet marsbahis imajbet perabet perabet giriş perabet perabet giriş