Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.05.2022
Share:

By Village Missionary Movement

Friday, 13-May-2022

దిన ధ్యానము(Telugu) 14.05.2022

 

అంశం:- కనికరం.

 

"కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు" - మత్తయి 5:7

 

వెస్ట్ మెక్సికో రాష్ర్టంలో ఉన్న 15 సంవత్సరాలు వయస్సు ఉన్న చిన్న వాడు కాన్సర్ వ్యాధితో భాధింపబడ్డాడు. కీమో తెరిఫి అనే చికిత్స చేయించు కున్న బాలుడికి భరించ లేని నొప్పి కలిగింది. ఎందుకనగా తలపై ఉన్న జుట్టంతా ఊడిపోయింది. వ్యాధి యొక్క ముగింపు ఏమిటో తెలియని పరిస్థితిలో బట్ట తలతో స్కూల్ కి వెళ్ళాడు. స్కూల్ కి వెళ్లడం సిగ్గుగా తలంచాడు. కాని పాఠశాలకు వెళ్లిన మొదటి రోజే తన కొరకు ఆశ్చర్యం వేచి ఉంది. తన తరగతి పిల్లల్లో చాలా మంది గుండు చేసుకొని వచ్చారు. ఆ బాలుడ్ని ప్రేమించిన ఆ పిల్లలు కొత్తగా వారి ప్రేమను వ్యక్త పరిచారు. స్నేహితుల యొక్క ఈ కార్యం ఆ బాలుడి యొక్క బాధను తీసివేసింది. 

 

పరిశుద్ద గ్రంధంలో ఫరో కుమార్తె ఏటిలో స్నానానికి వచ్చింది. స్నానానికి వచ్చిన ఆమె జమ్ము పెట్టెను చూసి తన పనికత్తెలలో ఒకతెను పంపి ఆ పెట్టెను తీసుకొని రమ్మని చెప్పింది. దానిని తెరచి ఆ పిల్లవాడ్ని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చు చుండగా చూసి వాని యందు కనికరించి వీడు హెబ్రీ యుల పిల్లలలో ఒకడనేను అని నిర్గమా కాండం 2:6 లో మనం చూడగలం. ఫరో కుమార్తె ఆ పిల్లవాడి మీద కనికరం చూపించింది. ఆ బాలుడు ఆ విధంగా ఆ రోజు కాపాడబడ్డాడు.

 

ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన కొండపైన ప్రసంగంలో కనికరమును గూర్చి మాట్లాడారు. మన దేవుడు కనికరం గల దేవుడు ఆయన వెయ్యి తరముల వరకు కరుణించే దేవుడుగా ఉన్నారు. 

 

ప్రియమైన వారలారా మన యొక్క జీవితంలో అంగీకరించే స్వభావం లేకుండా ఉండవచ్చు. కాని కనికరం లేకుండా ఉండ కూడదు. పాపములో, శాపములో జీవిస్తున్న మనకై యేసుక్రీస్తు కనికరం చూపించి కారునిస్తూ ఉన్నారు. మనం ఉండే స్థలములలో లేదా వుండే విధులలో ఉన్న వ్యక్తులపై మనము కనికరము చూపుతున్నమా? వారు మన కనికరము ద్వారా కరుణ గల దేవున్ని కనుగొనగలరా? 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్ధన అంశం:

టి. వి మూలముగా ప్రచురింపబడుచున్న మనయొక్క కార్యక్రమాల ద్వార అనేకులు క్రీస్తు కొరకు ఉత్సాహముగా నడుచుకొనులాగున ప్రార్ధిద్దాం

 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al