By Village Missionary Movement
Friday, 13-May-2022దిన ధ్యానము(Telugu) 13.05.2022
అంశం:- ఒకే ఒక్క సారి.
"నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను" - యోహాను 9:4
ఒక నోటీస్ బోర్డ్ పైన ఉన్న ఒక వచనమును చదివినప్పుడు ఆ వచనము ఎక్కువగా నన్ను ఆలోచింప జేసింది. నీవు ఈ లోక యాత్రలో ఒకే ఒక సారి వెళ్తావు. అది ఇతరులకు ఎంత ఉపయోగకరంగా ఉండగలదు అంతగా ఉపయోగపడేలా జీవించు అని చెబుతుంది ఆ వచనం. జీవితం అనేది మన చేతికి అందించే విలువైన ధననిది. ఒక్క సారే ఈ లోక యాత్రలో ప్రయాణం చేస్తాం. అది ఏదోలా ఉంది అని జీవితం వృధా చేసుకోకూడదు. ప్రతి ఒక్క సెకెనులో దేవుని కొరకు ఎంతగా ఉపయోగిస్తున్నాము? ఈ జీవుతంలో దేవుడు అనుమతించే శ్రమలను ఏ విధంగా చూస్తున్నాం.
యేసుక్రీస్తు కూడా మన కొరకు సిలువలో శ్రమలు అనుభవించారు. అందువలన మనకు సంపూర్ణ సమాధానము, ప్రేమ , పాప క్షమాపణ, మరియు నిత్యా జీవమును అనుగ్రహించారు. యేసుక్రీస్తు శరీర శ్రమలు మరియు సిలువ శ్రమలు భరించ లేకపోయినప్పటికీ మనకొరకు ఆ శ్రమలను అంగీకరించారు కదా. ఆయన తన ఎదుట ఉంచిన అనందముకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసం యొక్క కుడి పార్శమున కూర్చుని ఉన్నాడు అని హెబ్రీ 12:2లో వ్రాయబడి ఉన్నది. పరిశుద్ద గ్రంధంలో అపోస్తులుడైన పౌలును గూర్చి మనం చదువుతున్నాం. అతడు దేవుని చేత ఏర్పరచబడి, పిలుపును అందుకొని సేవ చేసాడు. కాని అతని జీవితంలో శ్రమలు లేకుండా పోలేదు. కాని తనను పంపిన వాని సేవ కొరకు తాను పడిన ప్రయాస 2కోరింది 11:28 మనం చూస్తున్నాం. కనుక తన యొక్క శ్రమలలో క్రీస్తుని చూస్తున్నాం. ఆయన ఏర్పరుచుకున్న అపోస్తులులే ఇంతటి శ్రమను అనుభవించి జీవించారు అంటే మనం ఏపాటి వారము. దేవుని పిల్లలారా ఒక వేళ మీరు శ్రమల గుండా వెళ్లినట్లుయితే జీవితమును ద్వేశించకండి. ఆ శ్రమలు మిమ్మును దేవుని రాజ్యమునకే గదా తీసుకొని వెళ్తున్నాయి. ఈ లోక శ్రమలు శాశ్వతమైనవి కావు. అందువలన ఈ ఒకే ఒక్క జీవితంలో కలిగే శ్రమల మధ్యలో పరమతండ్రికి మరియు ఇతరులకు ప్రయోజన కరంగా జీవించి ముగిద్దాం.
- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు.
ప్రార్ధన అంశం:
చైన్ ప్రేయర్ లో పాల్గొంటున్న ప్రతిఒక్కరిని దేవుడు ప్రార్ధనా శక్తితో, ఆత్మల భారంతో నింపేలా ప్రార్ధిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250