Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.05.2022
Share:

By Village Missionary Movement

Thursday, 12-May-2022

దిన ధ్యానము(Telugu) 12.05.2022

 

అంశం:- తీవ్రతగల వారై యుండుడి.

 

"ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి" - రోమీయులకు 12: 11

 

ఉత్తర భారతదేశంలో ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక దృశ్యం చూడగలం. అదేమిటి అంటే ఉదయం ఏడు గంటలకే సమోసా రెడీ అయిపోతుంది. తినుటకు వేడిగా, రుచికరంగా ఉంటుంది. వాటిని అమ్మే వ్యక్తులు గరం సమోసా గరం సమోసా అని గట్టిగా అరుస్తూ చెప్తూనే ఉంటారు. ఇందులో గమనించ వలసిన ఏమనగా ఉదయం ఏడుగంటలకు చేసిన సమోసాలను మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా గరం సమోసా అని చెప్తూనే ఉంటారు. కొంతమంది మరుసటి రోజు ఉదయం కూడా వాటినే అమ్ముతారు. మన దృష్టికి ఆ సమోసా ఎలా వున్నా వాటిని తయారు చేసేవారు తాము చేసినప్పుడు ఉన్నట్లే వేడిగా ఉండాలి అనుకొంటారు. 

 

అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి చాలా విషయాలు వ్రాసారు. అందులో రోమా 12వ అధ్యాయంలో ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అని వ్రాసారు. అనగా ఒక సేవకునిగా తన సంఘపు ప్రజలకు ఎటువంటి విషయాలు వ్రాస్తున్నారో గమనించి చూడండి. పౌలు యొక్క ఆలోచన అంతా తన ప్రజలు ఆత్మ యందు ఆశక్తి కలిగి ఉండాలి అనేదే. వారు ఆత్మీయ జీవితంలో పెరగాలి, చురుకుగా ఉండాలి, ఐక్యత గల ఆలోచనలు కలిగి ఉండాలి. లోకాను సారమైన ఆశీర్వాదం కంటే ఇటువంటి ఆశీర్వాదంతో ఉండి ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని కొరకు బ్రతకాలి మరియు దేవుని పరిచర్యను చెయ్యాలి. దేవుని నామమును మహిమ పరచాలి అనేదే పౌలు యొక్క కోరిక. 

 

ప్రియమైన వారలారా! దీనిని చదువుతున్న మీ హృదయం ఎలా ఉన్నది? సమోసాలు అమ్మేవారు తాము చేసిన సమోసాలు ఎప్పుడు వేడిగా ఉండాలి అనుకొంటారు. ఒక దేవుని సేవకుడు సంఘపు వారు ఆత్మీయత యందు తీవ్రత గలవారై యుండాలి అని ఆశ పడతారు. ఈనాడు క్రీస్తుని కలిగి క్రైస్తవులమైన మనము ఎల్లప్పుడు అగ్ని వలె ఉండాలి. అనగా మనం ఎల్లప్పుడు మాటలలో మరియు ఆలోచనలలో ఏదైనా ఒక కార్యం జరిగించుటలో ఇతరులకు మాదిరి కరముగా ఉండాలి. ఏ సమస్యనైనా ఎదుర్కొన్నప్పుడు కృంగి పోయి ఒక మూలన కూర్చో కూడదు. దేవుడు మిమ్మును ఏర్పరుచుకొన్నప్పుడు ఎలా ప్రేమించారో అదే విధంగా ఇప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అందువలన ఎల్లప్పుడూ దేవుని కొరకు నిలబడదాం. దేవుని కొరకు పరిగెడదాం. పరిగెడుతూ దేవుని కొరకు కార్యం జరిగిస్తూ ఉందుము గాక!.

- బ్రదర్. టి.శంకర్ రాజ్ గారు.

 

ప్రార్ధన అంశం:

మన తోటి సేవకులు ఐదు గ్రామాలలో పరిచర్య చేయుటకు ఏక మనస్సుతో నడుచుకొనులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al