Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.05.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 11-May-2022

దిన ధ్యానము(Telugu) 11.05.2022

 

అంశం:- ప్రశ్నించని విధేయత.

 

"నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపి యున్నాను" - ద్వితియోపదేశకాండము 26:14

 

ఒక ధనవంతుడు ఉద్యోగానికి మనుష్యులు కావాలి అని ప్రకటించాడు. చాలా మంది యవ్వనస్తులు ఆ ప్రకటన చూసి సంతోషించి ఆ ఉద్యోగానికి వచ్చారు. రెండు రోజులు మాత్రమే పనికి వచ్చి తరువాత ఆ ఉద్యోగానికి వచ్చే వారు కాదు. ఆ అపనికి వచ్చిన వారిలో ఎవ్వరూ కూడా ఎక్కువ రోజులు వుండేవారు కాదు. చివరిగా ఒక యవ్వనుడు ఉద్యోగానికి వచ్చాడు. ఆ ధనవంతుడు యవ్వనస్తుని చూసి అక్కడ పడి ఉన్న కంకర రాళ్లను తీసి కొంచం దూరం వెళ్లి పడవేయమని చెప్పాడు. ఇలా ఒక వారంలో చాలా రకములైన పనులు చెప్పే వాడు. అయినను ఎదురు మాటలు చెప్పకుండా అతని మాటలకు లోబడి పనులు పూర్తి చేసి ఆ వారపు జీతమును పొందుకున్నాడు. ఆదివారం సెలవు తీసుకొని మరలా సోమవారం ఉద్యోగమునకు వచ్చిన ఆ యవ్వనుడును చూసిన ఆ ధనవంతుడు చాలా ఆశ్చర్య పడ్డాడు. ఎందుకు ఏమిటి అని ఏ ప్రశ్న అడగకుండా యజమానుని ఆజ్ఞకు నిజాయితీగా లోబడిన యవ్వనుడికి తన చదువుకు జ్ఞానమునకు తగిన ఉన్నత పనిని ఇచ్చి రహస్యమును కాపాడేలా అతనిని నియమించాడు. ఆ యవ్వనుడు తన ప్రాణం ఉన్నంత వరకు ఆ కుటుంబానికి మంచి కాపరి వలె వున్నాడు. 

 

నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు అని యెహోవాయే మోషే కొరకు సాక్ష్యం ఇచ్చారు అంటే అతని జీవితం ఏ విధంగా ఉండేది. ప్రత్యక్షపు గుడారమును కట్టుటకు దేవుడు తన నిబంధనలను దాని యొక్క సూచనలను చెప్పినప్పుడు జాగ్రత్తగా అంగీకరించి అందులో తన సొంత జ్ఞానమును బయలు పరచకుండా తనకు ఇవ్వబడిన బాద్యతలను సంకోచం లేకుండా దేవుని స్వరానికి లోబడి నమ్మకంగా పనిని పూర్తి చేశాడు మోషే. 

 

ప్రియమైన వారలారా! మన యొక్క వ్యక్తిగత అంతరంగ జీవితంలో మనం దేవుని మాటకు లోబడుతున్నామా? పరిశుద్ద గ్రంధంలో ఆయన ఆజ్ఞాపించిన సమస్త ఆజ్ఞలకు లోబడుతున్నామా? ప్రశ్నించకుండా ఆయన మాటలకు లోబడే వారిని దేవుడు వెతుకుతున్నారు. అలా లోబడినప్పుడు నిశ్చయముగా ఆయన మన అందరిని అనేకులకు ప్రయోజన కరమైన జీవపు ఊట వలె మార్చుటకు ఆయన శక్తిమంతుడై యున్నారు. ఒక వేళ దేవుడు మిమ్మును మందిరంలో ఒక చిన్న పని చేయుటకు పిలిచి ఉండవచ్చు అందులో మీరు ప్రశ్నించక నా చదువుకు నా తలాంతులకు తగిన పని కాదు అని అనుకొనకుండా నమ్మకముగా ఆ పనిని చేసినప్పుడు మీ నిజాయితీని చూసిన దేవుడు మిమ్మును అనేకులకు అధిపతులుగా మార్చుతారు. చిన్న చిన్న విషయాలకే సణుగు కొనుచున్నట్లు అయితే మిమ్మును నమ్మి ఎవరైనా ఏ పనినైనా ఇవ్వగలరా? క్రింద మెట్టు మీద కాలువేస్తేనే పై మెట్టుకు వెళ్ళగలం. మనం ఆయన యొక్క స్వరానికి చెవియొగ్గి ప్రశ్నించకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చితే నిశ్చయముగా మనలను ఆయన హెచ్చిస్తారు.

- బ్రదర్. హరీష్ సామువేల్ గారు

 

ప్రార్థన అంశం:

2000 మందికి సరిపడే ప్రార్థనా గుడారము యొక్క కట్టడ పనులు త్వరలో పూర్తి చేసి, దేవుని నామం మహిమార్ధముగా ప్రతిష్టం చేయులాగున ప్రార్ధిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al