Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 27.01.2021
Share:

By Village Missionary Movement

Wednesday, 27-Jan-2021

దిన ధ్యానము(Telugu) 27.01.2021

చిన్న చూపు:

"కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి" - కీర్తనలు 75: 5

గుర్తు గుర్తులుగా నిండియుంది ఆ బొప్పాయి చెట్టు. పక్కనే ఒక చిన్న మొక్క యుండుట చూచి నీ యొద్ద ఏమి లేదు, నీ దగ్గర అది లేదు ఇది లేదు అని హేళన చేసి మాట్లాడింది ఆ బొప్పాయి చెట్టు. పెద్ద గాలితో కూడిన వర్షం వచ్చేసరికి ఆ బొప్పాయి చెట్టు పడిపోయింది. కాని ఆ చిన్న మొక్క అయితే తనకు ఉండిన ఆ కొద్దిపాటి బలముతో నిలబడి ఉంది. మనము కూడా అనేక సందర్భాల్లో దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదములను ఇతరులకు చూపించి వాళ్లను హేళనగా మాట్లాడుతూఉంటాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదములను బట్టి ఇతరులకు ప్రయోజన కరముగా జీవించాలే తప్ప వాటిని చూపించి ఇతరుల మనస్సు నొప్పించుటకు లేదా హేళన చేయుటకు మనము ఎప్పుడు తలంచకూడదు. 

బైబిల్లో అనేక మంది పిల్లలను కని, పెంచిన పెనిన్న పిల్లలు లేని హన్నాను హేళనగా చూసి మనస్సును నొప్పించింది. హన్నా యొక్క కన్నీరును చూచిన దేవుడు ఆమెకు ఒక బిడ్డను అనుగ్రహించారు. ఆ బిడ్డను ఇశ్రాయేలీయుల ఉజ్జీవమునకు దేవుడు వాడుకొని రాజులను అభిషేకించే ఉన్నత పనిని దేవుడు అప్పగించారు. కాని పెనిన్న యొక్క పిల్లల పేర్లు కూడా మనకు తెలియదు. ప్రియమైన తల్లిదండ్రులారా మీ పిల్లల యొక్క ఎదుగుదలకు, దీవేనకు మీరే ఆటంకంగా ఉండిపోవద్దు. పెనిన్న యొక్క గర్వపు మాటల వలన ఆమె యొక్క పిల్లలు వాడబడలేదు. ఒక వేళ మన పిల్లల యొక్క తలాంతులు దేవునికి, ఇతరులకు ప్రయోజనకరంగా వాడబడకపోతే దానికి కారణం మన యొక్క గర్వం కారణం కావచ్చు. 

ప్రియమైన వారాలరా! మన దేవుడు గర్విష్ఠులను ఎదిరించే దేవుడు. అదే సమయంలో నా యొద్ద చెప్పుకోతగిన కార్యములు ఏమి లేదే అని బాధపడుతున్న వారికి తన కృపను యనలేని ప్రేమను కుమ్మరించి వాళ్ళను వాడుకొనుటకు ఆయన సమర్థుడు. కాబట్టి మనము మన సంతతి వారికి దీవెన కరముగా ఉండాలి అంటే గర్వము అనేది మనలో నుండి తీసివేద్దాం. ఎవరిని ఆశ్రద్ద చేసి మన ఆశీర్వాదములను పోగొట్టుకోకుండా ఉందాం. అదే సమయంలో హేళనగా ఎంచబడిన వారు ఇతరుల యొక్క మాటల వలన నిరుత్సాహపడి ఒంటరిగా వెళ్లి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అప్పగించుట చూస్తున్నాం. అంతరంగంలో మనం కార్చే కన్నీరును చూచే దేవుడు ప్రత్యక్షంగా ఫలమిస్తారు.
-    బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్.

ప్రార్థన అంశం:-
పీస్ సెంటర్ పరిచర్య ద్వారా అభిషేకించబడిన సేవకులను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్దిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet