Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 03.05.2022
Share:

By Village Missionary Movement

Monday, 02-May-2022

దిన ధ్యానము(Telugu) 03.05.2022

 

అంశం:- టి.బి

 

"సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు" - సామెతలు 14:30

 

90వ శతాబ్దంలో వుండే విద్యా వ్యవస్థ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయుడు పసుపు రంగులో ఉన్న ర్యాంక్ కార్డు ఇచ్చేవారు. అప్పుడు ఎవరి కన్నులు వారి యొక్క ర్యాంక్ కార్డు పైన ఉండవు కాని పక్కనున్న వారిపై, ముందున్న వారిపైనే, వెనుక ఉన్న వారిపైన ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థిని పొగుడుతున్నప్పుడు అందరిని చప్పట్లు కొట్టమని చెప్పినప్పుడు తనని క్లాస్ లీడర్ గా మార్చి నప్పుడు టీచర్ లేని సమయంలో అతను అందరిని గమస్తున్నప్పుడు మాట్లాడే వారి లిస్టులో మన పేరు వ్రాసినప్పుడు ఇంకా ఇలా చాలా చెప్పవచ్చు. ఇలా బాగా చదివే విద్యార్థి ఏం చేసినా సరే మనకు అసూయ కలుగుతుంది. కాని ఇప్పుడు అవన్నీ గుర్తు వస్తే అవన్నీ నవ్వులాటగా మరియు కొంచం బాధగా వుంటుంది. 

 

పరిశుద్ద గ్రంధం కీర్తనలు 106:16లో వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి అని చదువుతున్నాం. మోషే అహరోనులు దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఇశ్రాయేలీయులు ప్రజలు అందరిని నడిపించే బాధ్యత వారి యొద్ద ఉండేది. ఇటువంటి బాధ్యతను వహిస్తున్న వీరి మీద అసూయ పడుట వలన దాతాను మరియు అభిరాముకు ఏర్పడిన నాశనమును గూర్చి కీర్తనలు 106:17లో మనం చుస్తున్నాం. పైన చెప్పబడిన రెండు వాక్యములు మనకు హెచ్చరిక పాఠములు నేర్పిస్తున్నాయి.

 

ప్రియమైన వారలారా! ఈనాడు మన మనస్సు ఎలా ఉంది మన సమీపంలో ఉన్న వ్యక్తికి లేదా మన కుటుంబంలో ఉన్న వారికి ఏదైనా ఒక మేలు జరిగితే మనము అసూయ పడుతున్నమా? బైబిల్ గ్రంధం లో వాక్యము అసూయను వ్యాధితో సూచిస్తుంది. మనమే జాగ్రత్తగా ఉండి మనస్సులో అసూయను ఉంచుకొనక ఇతరులను ప్రశంసిస్తూ ఉత్సాహ పరుస్తూ ఉండాలి. అప్పుడే మనకు మేలు జరుగుతుంది. మన బంధువులు, తోటి పనివారు, మనతో సేవచేస్తున్న వారిపైనే ఉన్న అసూయను తీసి వేసేద్దాం. ఇతరులపైన మనము అసూయ పడితే అది మనలనే నాశనం చేస్తుంది. పోటీ ఉండవచ్చు కాని అసూయ ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. అందువలన అసూయ అనే చెడు స్వభావమును విడిచిపెట్టి మంచి మనస్సుతో జీవిద్దాం. ఆమెన్.

- బ్రదర్. టి.శంకర్ రాజ్ గారు.

 

ప్రార్ధనా అంశం:-

తమిళనాడు, ఆంద్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల్లో సేవచేసే మన గ్రామ మిషనరీలను దేవుడు బలముగా వాడుకొనేల ప్రార్దిద్ధాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet