Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 02.05.2022
Share:

By Village Missionary Movement

Sunday, 01-May-2022

దిన ధ్యానము(Telugu) 02.05.2022

 

అంశం:- కనుపాప వినుము.

 

"కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి" - కొలస్సీయులకు 3:12

 

బ్యూటీ తన పేరుకు తగ్గట్టుగానే అందముగా ఉన్న యవ్వనరాలు. తన అందానికి ఇంకను అందం చేర్చేటట్లు తన ముఖంలో ఆనందం ఉంటుంది. కళాశాలలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనుటకు ఉదయం నుండే తనను సిద్ధపరచు కొంటుంది. చూచిన వారి యొక్క దృష్టిని ఆకర్షించు కొనుటకు తన్ను తాను వశీకరించే విధంగా చూపించే టట్లు కొన్ని గంటల్లో పాడైపోతున్న అలంకరించే వస్తువుల చేత తన ముఖమును అలంకరించు కొంటున్నది. తన ఆకర్షణీయమైన కనులకు కాటుక పెట్టుకొని, ఎర్రని పెదవులపై ఇంకను రంగులు పూసుకుని ఉన్న ఆ యవ్వనురాలి యొక్క చెవిలో ఒక స్వరం వినబడింది. పుట్టిన కొన్ని నెలల్లోనే తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేని దానిగా ఉండిన ఈమెను ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచిన పెంపుడు తల్లి యొక్క స్వరమే అది. మరణకరమైన రోగముతో సహాయము కొరకు తనను పిలిచిన ఆ తల్లి యొక్క స్వరాన్ని ఆశ్రద్ద చేసి ఎంత మాత్రం కనికరము లేకుండా పిచ్చుక వలె ఎగురుతూ ఆ కార్యము జరుగుతున్న కళాశాలలోనికి వెళ్లిపోయింది. ఆ పోటీలో పాల్గొని బహుమతి కూడా గెలుచుకుంది. బహుమతితో ఇంటికి వచ్చిన ఆమెకు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఏడ్పు వినబడింది. వేగంగా ఇంటిలోకి వెళ్లిన ఆమె కనులకు అప్పటివరకు పోషించిన పెంపుడు తల్లి యొక్క శవము కనిపించింది. తనకు ఉన్న ఒక్క ఆదరణ ఆయిన తల్లిని పోగొట్టుకొనిన మనస్సు తల్లడిల్లి పోయింది. సహాయం కొరకు పిలిచి నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళలేదు అనే వేదన ఇంకా మారలేదు. ప్రయోజనం ఏమిటి సమయం దాటిపోయింది కద మరణించిన ఆమె మరలా రాబోతోందా? 

 

ప్రియమైన దేవుని పిల్లలారా! అందం అని దేనిని తలంచుతున్నాము? మంచి రంగు, ఫ్యాషన్, మ్యాకప్, బట్టలు వేసుకొని ఆకర్షణీయంగా కనబడటమేన అందం. పై రూపాన్ని అందంగా కనిపింపచేసి దేవుడు చూస్తున్న అంతరంగ హృదయపు అందాన్ని కాపాడు కోకుండా మురికితో హృదయం కనబడిన యెడల ప్రయోజనం ఏమిటి?

 

ఈ దినం కూడా పేదవారికి యొక్క ఆకలి ఆరుపులకు చెవులు మూసుకొని, మన యొద్దకు సహాయం కోరి వస్తున్న వాళ్లకు మొకాన్ని చాటేసి, వృద్ధాప్యంలో ఉన్న వారిని లెక్క చేయకుండా ఉండుటయు, పెద్ద వాళ్ళను ఆశ్రద్ద చేయుటయును పెద్ద వాల్ల యొక్క సలహాలను తిరస్కరించుటయు అనేది ఈ రోజు పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. లోకంలో ఉన్న పిల్లలకు మరియు క్రీస్తుని ఎరిగిన పిల్లలకు వ్యత్యాసం కలదు. క్రీస్తు నందు ఉన్న వాళ్ళు క్రీస్తు పొలికను ప్రత్యక్ష పరిచేవారిగా కనబడాలి. శాంతము, దీనత్వము, ప్రేమ, కనికరము కలిగిన వారిగాను ఎప్పుడు తన సొంత కార్యమే కాక క్రీస్తుని ప్రకటించే వారిగా నశించి పోతున్న తన స్నేహితులను గూర్చిన భారం కలిగిన వారిగా కనబడాలి. ఇలాంటి అందమైన గుణాతిశయమును వ్యక్త పరుచుటయే దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నారు. లోకంలో జీవించినంత మాత్రాన క్రైస్తవ జీవితం కాదు లోకము కొరకు మనం జీవించ కుండా క్రీస్తు కొరకు జీవించుటయే మన గురిగా కలిగి ఉంటాం. 

- శ్రీమతి. వసంతి రాజ మోహన్.

 

ప్రార్ధనా అంశం:- 

ఈ నెల అంతా జరిగే పరిచర్యలో దేవుని హస్తం తోడుండు లాగున మరియు దేవుడు తన మహిమను బయలుపరచు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al