By Village Missionary Movement
Saturday, 30-Apr-2022దిన ధ్యానము(Telugu) 30.04.2022
అంశం:- వయస్సు ఆటంకం కాదు.
"కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము" – 2 కోరింథీయులకు 4:1
మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ శృస్టుకి సువార్తను ప్రకటించుడి అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకు లోబడి సువార్తను ప్రకటించిన దేవుని సేవకులను మనం చూస్తున్నాం వారిలో జార్జ్ ముల్లర్ ఒకరు. అలసటకు చోటియ్యక తన 93వ సంవత్సర వయస్సు వరకు దేవుని సేవను చేసిన వారు జార్జ్ ముల్లర్. 90వ సంవత్సరంలో అతనిని పరిశోధించిన డాక్టర్ ఇకపై మీరు వారానికి ఒక్కసారి మాత్రమే ప్రసంగించాలి అని చెప్పారు. కాని జార్జ్ ముల్లర్ గారు మాత్రం 68 సంవత్సరాల 3 నెలలు నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో చాలా దప్పిగొని యున్నాను. సుమారుగా 4200 సార్లుకు పైగా పరిశుద్ద గ్రంథమును చదివి ఉంటాను. అందువలన దేవుని స్తుతించుటలో, ప్రసంగించుటలో నాకు అలసట ఎలా వస్తుంది. నా దేవుని గూర్చి మాట్లాడ కుండా నేను ఎలా ఉండగలను అని అన్నారు. ఈ సంగతులను తమ విశ్వాసులకు ఒక పత్రిక ద్వారా వ్రాసారు.
జార్జ్ ముల్లర్ గారు పరిశుద్ద గ్రంథమును 100 సార్లు మోకాళ్లపై నిలబడి చదివారు అని తెలియజేయబడింది. పరిశుద్ద గ్రంధం ప్రకారంగా జీవించిన అతని యొక్క ప్రార్థనా జీవితం అలసిపోని శ్రమ, సోమరితనం లేని జీవితం వాక్యముతో నిండిన ప్రసంగం అనేకుల జీవితములో దాహమును ఏర్పరిచింది. దేవుని వాక్యములో సంతోషించి, ప్రేమించి ధ్యానించి 93వ సంవత్సర వయస్సు వరకు జీవించి చూపించిన వ్యక్తి అయిన జార్జ్ ముల్లర్ కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం.
పరిశుద్ద గ్రంధంలో వృద్ధాప్యంలో దేవుని కొరకు చివరి శ్వాస వరకు జీవించిన వారు అనేకులు కలరు. అబ్రాహాము, మోషే, యేసుక్రీస్తును ఎత్తుకొనిన సుమ్యోను, హన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. వీరు తమ వయస్సును ఒక కారణంగా ఎంచుకొని దేవుని కొరకు సేవ చెయ్యకుండా ఆగిపోలేదు. ఒక వేళ మీరు నాకు వయస్సు అయిపోయింది, నీరసంగా ఉంది మునుపటి వలె ఏ పనిని చెయ్యలేకపోతున్నాను అని బాధపడుతున్నారా? అలసిన వారిని బలపరచి, బలము లేని వారిని బలము నిచ్చిన దేవుడు మీతో ఉన్నారు. సేవచేయుటకు, పరిశుద్ద గ్రంథమును చదువుటకు వయస్సు అనేది ఆటంకం కాదు కాబట్టి మనము దేవుని కొరకు అలసిపోకుండా ప్రయాస పడదాం. దేవుని కృప మనలను ఆదరించును గాక! ఆమెన్.
- శ్రీమతి..సరోజా మోహన్ దాస్
ప్రార్ధన అంశం:-
గ్రామాలను ఆదరించే వారు లేచేలా అందు మూలమున గ్రామాల్లో ఉజ్జీవం కలిగేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250