Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.04.2022
Share:

By Village Missionary Movement

Friday, 29-Apr-2022

దిన ధ్యానము(Telugu) 29.04.2022

 

అంశం:- నాలుక యొక్క శక్తి.

 

"జీవమరణములు నాలుక వశము" - సామెతలు 18:21

 

నా యొక్క సేవ స్థలము నుండి నా కుటుంబం చూడటానికి నా యొక్క సొంత స్థలమునకు వెళ్ళాను. నేను మా ఊరు వచ్చాను అని తెలిసి నా స్నేహితుడు నన్ను చూడటానికి వేరే ఊరి నుండి మా ఊరికి వచ్చాడు. రోజంతా నాతో మాట్లాడి ఆ రోజు సాయంత్రం తన ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు. నేను తనని బైక్ లో బస్ స్టాండ్ వరకు తీసుకువెళ్లాను. నా యొక్క బైక్ పాతది కావడంతో హారన్ సరిగ్గా మోగదు, లైట్ కూడా చాలా డిమ్ గా వెలుగుతుంది. ఎందుకనగా బైక్ లో బ్యాటరీ డెడ్ అయిపోయింది. దానిని చూసిన నా స్నేహితుడు నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు అని బైక్ యొక్క పరిస్థితి చూసి అడిగాడు. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు నేను తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు యేసయ్య నా బైక్ నడుపుతారు అని చెప్పాను. నేను అతనిని బస్ స్టాండ్ దగ్గర దించేశాను. బస్ కూడా వచ్చింది అతను ఎక్కి వెళ్లిపోయాడు. నేను కూడా నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తున్నాను. కొంచం దూరం వెళ్ళేక తెలిసింది నా లైట్ బాగా వెలుగుతుంది అని. అప్పుడే నేను తెలుసుకున్నాను. దేవుడు మన యొక్క చిన్న చిన్న మాటలను విని మనకు కార్యం చేస్తున్నారు అని. అందువలన మన నోటినుండి వచ్చిన చిన్న కార్యమైన పెద్ద కార్యమైన మనం ఆయనను ఘనపరచాలి. అప్పుడు ఆయన కూడా మన మాటలను ఘనపరుస్తారు. ఇంకా చూసినట్లు అయితే పరిశుద్ద గ్రంధం చెబుతుంది ఒక్క నోటనుండి శాప వచనమును, ఆశీర్వాద వచనమును బయలు వెళ్లును అని. ఇలా నాలుకను గూర్చి అనేక వచనములు మనం చదవగలం. కాని మనం చాలా సమయాల్లో ఈ విషయమును ఎరిగి నాలుకను ఉపయోగించి మన మనస్సులో ఉన్న దానిని మాట్లాడి ఇతరులను గాయపరుస్తూ ఉంటాం. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకు అర్థం ఉంది శక్తి ఉంది. కాబట్టి మన మాటలను బట్టి మనం దేవునికి లెక్క అప్పగించాలి. 

 

కావున ప్రియమైన వారలారా! మనం మన యొక్క నోటి మాటలను జాగ్రత్తగా కాపాడుకొందాం. మన మాటలు దేవున్ని హెచ్చించేలా ఆయనకు పొగిడేలా ఆయన నామము మహిమ పరిచేలా ఉండనిద్దాం. దేవుడు మనకు చేసిన మేలులు నిమిత్తం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుని రాజ్యమును సొంతం చేసుకుందాం. హల్లెలుయా!

- బ్రదర్. పి.జాన్ థామస్ గారు

 

ప్రార్ధన అంశం:

ప్రార్ధనా గుడారం త్వరగా కట్టబడేలా మరియు ఆవసరతలు సందించబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al