Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 25.04.2022
Share:

By Village Missionary Movement

Monday, 25-Apr-2022

దిన ధ్యానము(Telugu) 25.04.2022

 

అంశం:- నమ్మకము మరియు పెరుగుదల.

 

"మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును" - లూకా 16:10

 

1862వ సంవత్సరం అమెరికాలో దేశీయ యుద్ధం జరిగింది. ఆ సమయంలో రాబర్ట్ యిలి ఆనే ఒకతను అమెరికా యొక్క ఉత్తర ప్రాంతాలను అక్రమించుకొనుటకు యుద్ధం చేసాడు. అతనికి వ్యతిరేకంగా తన దేశమును కాపాడుటకు కర్నాల్ హేయస్ తన బలగాలతో విపరీతమైన యుద్ధంలో పాల్గొనినప్పుడు సమయం గడుస్తున్నప్పుడు యుద్ధ సైనికులు ఆకలితో అలమటించారు. ఆ సమయంలో తన ప్రాణం కూడా లెక్కచేయకుండా బిల్లి అనే 19 సంవత్సరాల వయస్సు గల యవ్వనుడు భుజించుటకు వేడివేడి ఆహారమును, త్రాగే పానియాలను వాహనంలో ఎక్కించుకొని నేరుగా యుద్ధం జరుగుతున్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు. అలసిపోయి ఉన్న సైనికులు ఇతని ధైర్యం చూసి ఆశ్చర్య పోయారు. తాను తీసుకొని వచ్చిన ఆహారమును వేగంగా భుజించి, పానియములు త్రాగి మరల బలమును పొందుకొన్నారు. ఈ సంగతి విన్న కర్నాల్ హేయస్ బిల్లికి ఉన్నత పదవిని ఇచ్చారు. ఈ కర్నాల్ హేయస్ తరువాత అమెరికా యొక్క 19వ జనాధిపతిగా రూథర్ ఫోర్ట్ హేయస్ ను అతని తరువాత 20వ జనాధిపతిగా పదవిలో ఉన్న వాడు విలియమ్స్ మార్క్ కినెల్లి. ఇతను ఎవరో కాదు ఆ రోజు యుద్ద సైనికులకు తగిన సమయంలో ఆహారం ఇచ్చిన బిల్లియే 

 

హేయస్ బిల్లి గురించి చెప్పబడిన మాట అతను యవ్వనస్తుడిలా వుండేటప్పుడు ఒక పనిని అప్పగిస్తే రాత్రి పగలు అని తేడా చూడకుండా ఆ పనిని చేస్తాడు. చలి, తుఫాను, వర్షం అనేవి ఏవి కూడా అతని పనికి ఆటంక పరచవు. బాధ్యత తప్పిపోని వాడివలె అప్పగించిన పనిని సరైన సమయంలో చేసిన వాడివలె వున్నాడు అని చెప్పారు. 

 

దావీదు తన గొర్రెలను నిజాయితీగా మేపి ఎలుగుబంటి మరియు సింహం నోళ్లనుండి కాపాడుటకు చూసి యెహోవా తన ప్రజలను పరిపాలించు లాగున ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశారు. ఈ రోజు మనకు అప్పగించబడిన పనులు మిక్కిలి చిన్నవిగా ఉండవచ్చు. కొన్ని సమయాల్లో మనం కఠినంగా కష్టపడి నిజాయితీగా చేసిన పనికి ఈ లోకం తగిన గుర్తింపు లేకపోవచ్చు. ప్రపంచంలోనే భారతదేశమునకు చాలా కష్టపడి పనిచేసే వారు అని పేరు ఉన్నప్పటికీ పని స్థలాలలో దానికి తగిన పెరుగుదల దొరకడం లేదు. కావున దానిని మనస్సులో ఉంచు కొనకుండా ప్రభువు మనలను గమనిస్తున్నారు అనే ఆలోచనతో క్రమంగా పనిచేద్దాం. పౌలు చెప్పిన విధంగా మనుష్యులను సంతోష పెట్టుటకు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా జరిగించుచు మనుష్యులకు చేసి నట్లు కాక ప్రభువునకే ఇష్టపూర్వకంగా చేయుడి. 

- బ్రదర్. అనీష్ శామ్యూల్ గారు

 

ప్రార్ధన అంశం:-

గెత్సేమనే క్యాంపస్ లో జరుగుతున్న సిమెంట్ పనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ దేవుడు ఆశీర్వదించేలాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet