Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.04.2022
Share:

By Village Missionary Movement

Friday, 22-Apr-2022

దిన ధ్యానము(Telugu) 22.04.2022

 

అంశం:- నమ్మిన వారు చేయి విడిచిపెడితే.

 

"మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు" - కీర్తనలు 118:8

 

1991 వ సంవత్సరం ఆగస్టు 4వ తేదీన ఏం.టి.ఎస్ ఓ.సి.ఎస్ అనే విహారయాత్ర ఓడ దక్షిణ ఆఫ్రికా సముద్ర తీరం దాటిన తరువాత ఒక ప్రమాద కరమైన తుఫానులు చిక్కుకుంది. ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రజలకు ఓడలో ఉన్న ప్రమాదం తెలియజేయకుండా ఆ ఓడ క్యాప్టెన్ ఓడను విడిచిపెట్టి తన తోటి అధికారులతో కలిసి తప్పించు కోవాలి అనుకున్నాడు. అందులో ప్రయాణం చేస్తున్న ఆంగ్ల సంగీత కళాకారుడు మోస్ యిల్స్ ఏదో ప్రమాదం జరగబోతుంది ఆని ఏరిగి దక్షిణ ఆఫ్రికా తీరప్రాంత సైనికులకు భద్రత సమాచారం ద్వారా సంకేతాలు పంపించాడు. తగిన సమయానికి వర్తమానం పంపించడం వలన ఆ సైనికులు హెలికాప్టర్ ద్వారా ఆ ఓడ దగ్గరకు చేరుకున్నారు. ఆశ్చర్య కరంగా ఎవరికి ప్రాణహాని కలుగకుండా అందరూ రక్షించబడ్డారు. 

 

మనలను సంరక్షించే వ్యక్తులు లేదా మనలను నడిపించే వ్యక్తులు మనలను ఒంటరిగా విడిచిపెడితే ఏం చెయ్యగలము. అయితే పరిశుద్ద గ్రంధంలో ఇదేవిధంగా చాలా సంఘటనలు చాలా చోట్ల మనం చూడగలం. ఎవరెవరు నమ్మదగిన వారిలా లేక రక్షించే వారిలా ఉన్నారో వారే వారిని నమ్ముకొనే వారికి ప్రమాదానికి గురి చేసేవారిగా మారారు. 

 

ఈ వార్తను చదువుతున్న మీలో అనేకులు కచ్చితంగా ఇటువంటి అనుభవములు దాటి వెళ్లి ఉండవచ్చు. ప్రమాదం అనేది వచ్చినప్పుడు వారిని కాపాడుకొని ప్రక్కన ఉన్న వారిని విడిచిపెట్టడం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. అయితే దీనికి తీర్పు ఏమిటి అనేది పరిశుద్ద గ్రంధం చెప్పేదానిని గమనించాలి. కీర్తనల గ్రంధంలో దావీదు ప్రభువా నేను దేనికొరకు కనిపెట్టుకొందును నిన్నే నేను నమ్ముకొని యున్నాను అని కీర్తనలు 39:7 లో చెబుతున్నారు. ప్రభువును మనం నమ్ముకొని వున్నప్పుడు ప్రమాదకరమైన పరిస్థితుల్లో కృంగిపోవలసిన అవసరం లేదు. దేవుని మాటలు మరియు ఆయన శక్తి మనలను విడిపించ దగినదై యున్నవి. 

 

క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మహిమ గలిగిన దేవుని వాగ్దానాలు మనకు ఉన్నవి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా వుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును. నిన్ను విడువను నిన్ను ఎడబయను అని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. మీరు ఒంటరిగా విడిచిపెట్టబడి ఉన్నారు అంటే దేవుని యొక్క మాటల పైనే అనుకొనండి. దేవుడు మిమ్మును నడిపించును గాక! 

- బ్రదర్. పి.జాకబ్ శంకర్ గారు

 

ప్రార్ధన అంశం:-

మిషనరీలు నివాసం ఉండి శిక్షణ పొందుకొనుటకు ఒక మిషనరీ హౌస్ కట్టుటకు అవసరమైన రెండు లక్షలు దేవుడు మనకు ఇచ్చేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet