Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.04.2022
Share:

By Village Missionary Movement

Thursday, 21-Apr-2022

దిన ధ్యానము(Telugu) 21.04.2022

 

అంశం:- శ్రమలను సహిద్దాం.

 

"సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును" - 2తిమోతికి 2:12

 

ఇంగ్లాండ్ లో పుట్టిన విలియం మాల్ట్ అనే అతను శ్రీలంకలో సేవచేయుటకు వ్యక్తులు కావాలి అని విని తనను సమర్పించు కొన్నారు. దేవుడు తనకు ఇచ్చిన పరిచర్యలో భుజం అందించే స్త్రీని పెళ్లి చేసుకున్నారు. తన భార్య మరియు కొన్ని కుటుంబాలతో కలసి నౌకలో ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా గాలి తుపాన్ నౌకను కదిలించగా చాలా మంది గాయపడ్డారు. విలియం మాల్ట్ వాళ్ళ భార్య యొక్క శరీరం గాయములతో నిండిపోయి చాలా బాధ పడ్డారు. వైద్య సదుపాయం లేకపోవటంతో ఆమె ప్రాణం కోల్పోయారు. మనోవేదనతో తన భార్య శరీరమును సముద్రంలో పడవేసి ప్రయాణమును కొనసాగించారు విలియం. బాధతో శ్రీలంకకు వచ్చారు. సుసంపన్నుడై బ్రతికిన అతను శ్రీలంక లో అతను ఒక గుడిసె ఇంటిలో సరైన ఆహారం లేక తమిళమును రెండు నెలల్లో నేర్చేసుకున్నారు. పైగా 8నెలలో 8గ్రామాలలో పాఠశాలలు, కళాశాలలు , సేవా స్థలాలను ఏర్పాటు చేశారు. విలియం మాల్ట్ జీవితంలో చాలా పోరాటాలు , శ్రమలు ఉన్నప్పటికీ వెనుదిరుగక, సనుగుకొనక, అలసిపోకుండ ఉన్నారు. ఈ రోజుల్లో అనేకులు ఉద్యోగాలలో, కుటుంబాలలో, పరిచర్యలలో శ్రమలు పోరాటాలు వస్తే ఈ పని వద్దు, ఈ పరిచర్య వద్దు అని కృంగిపోతున్నారు. లేకపోతే వేరే ఉద్యోగం, వేరే స్థలం అని వెళ్లిపోతున్నారు. పరిశుద్ద గ్రంధంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ఏలీయా, యోనా అనే వారు వారి జీవితంలో శ్రమలు పోరాటాలు వచ్చినప్పుడు నా ప్రాణము తీసుకొనుము నన్నిక బ్రతుకనియ్యక చంపుము అని ప్రార్ధన చేశారు. కాని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తల వాల్చుకోనుటకైనా స్థలం లేకుండా జీవించి సిలువమరణము గురించి తెలిసి కూడా అంగీకరించి మన కొరకు శ్రమలు అనుభవించి మరణించారు. 

 

ప్రియమైన వారలారా! మీకు అప్పగింపబడిన పని , పదవి, పరిచర్యలలో సమస్యలు గందరగోళం పోరాటాలు ఉంటాయి. కాబట్టి వాటిని ద్వేషించి, సనుగుకొనక, కృంగిపోకుండా దేవుని యొద్ద బలము కోరుకొని పరుగుని కొనసాగిద్దాం. శోధనా శ్రమలు సహించిన క్రీస్తుని తలంచుచు ముందుకు కొనసాగుదాం. నిశ్చయముగా పరలోకంలో ఉన్నతస్థాయిని పొందుకుందాం.

- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్

 

ప్రార్థన అంశం:-

మన తోటి మిషనరీలు సేవచేసే ప్రాంతాల్లో చర్చిలు కట్టబడేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet