By Village Missionary Movement
Monday, 25-Jan-2021దిన ధ్యానము(Telugu) 25.01.2021
మట్టపు గుండు
"...నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను" - ఆమోసు 7: 8
కట్టడపు పని చేస్తున్న ఒక మెస్త్రి ఒక గోడ కడుతున్నప్పుడు ఆ గోడ తిన్నగా ఉందా లేదా అని సరిచూసుకొనే వస్తువే ఈ మట్టపు గుండు. మూడు లేదా నాలుగు ఇటుకలను ఒక దానిపై ఒకటి పెట్టి ఈ మట్టపు గుండుతో ఆ వరుసలు అన్ని కూడా సరిగా క్రమముగా ఉన్నాయో లేదో అని సరిచూస్తారు. క్రమంగా లేని యెడల ఆ ఇటుకలను సరి చేసి ఆ గోడను తిన్నగా కడతారు.
మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బైబిల్ ఒక కట్టడముతో పోల్చుతుంది (ఎఫెసీ 2:19-22). ఈ కట్టడము పరిపూర్ణముగా కట్టబడుటకు మట్టపు గుండు అవసరము. దేవుడు మనకు ఇచ్చిన బైబిలే ఆ మట్టపు గుండు. మనుష్యులు తమ కంటితో గోడను చూసినప్పుడు అది సరిగా ఉన్నట్టే అనిపిస్తుంది కాని మట్టపు గుండె దానియొక్క లోపాన్ని చూపించ గలదు. అలాగే మనము చేసే కార్యములు సరిగా ఉండినప్పటికి దేవుని యొక్క మాటలతో సరిపోల్చుకొని చూసుకొనిన యెడల మన కొదువలను చూసుకోవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు జనంగామును మట్టపు గుండు ద్వారా సరి చూస్తాను అని అంటున్నారు. ఎందుకు అంటే మట్టపు గుండు ఎప్పుడు తప్పు చెప్పదు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తుంది. ఇశ్రాయేలీయుల చేస్తున్న కార్యములు, మార్గములు దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టి ఇశ్రాయేలు జనంగాము చేరపట్టబడి తీసుకు వెళ్లుటకు అప్పగించబడ్డారు.
ప్రియమైన వారాలరా! మట్టపు గుండు అయిన బైబిల్ రోజు మనం చదువుదాం. సరి చేసుకొనవలసిన కార్యములను సరిచేసు కొనినయెడల మీ జీవితం క్రమంగా దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. సరి చేసుకొనక పోయిన యెడల మీ జీవితం దేవుని దృష్టికి వంకరగా ఉంటుంది. అది దేవుని శిక్షకు దారి తీస్తుంది. మట్టపు గుండుతో మీ జీవితమును సరిచూసిన యెడల మీ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి? ఆలోచించి చూద్దాం, కార్యములను సరిచేసుకొందాం.
- బ్రదర్. గాంధీ రాజన్
ప్రార్థన అంశం:-
మన పరిచర్యను ప్రార్ధనతోను, కానుకలతోను సపోర్ట్ చేస్తున్న పాట్నర్స్ ను దేవుడు అపరిమితముగా దివించేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250