Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 20.04.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 19-Apr-2022

దిన ధ్యానము(Telugu) 20.04.2022

 

అంశం:- ఉన్నది చాలు.

 

"సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమైయున్నది" - 1తిమోతికి 6:6

 

శిల్పి ఒకరు ఒక పెద్ద రాయిని తీసుకొని దాని పైన శిల్పం చెక్కడం ప్రారంభించాడు. తలపైన సూర్యుని కిరణాలు తాకడం వలన ఛీ ఇదేమి జీవితం ఎప్పుడు ఎండలో నిలబడి సుత్తిని తీసుకొని చెక్కుతూనే ఉన్నాను. నాకు వేరే మంచి పని మరియు సులభంగా ఎక్కువ జీతం దొరికితే చాలా బాగుంటుంది అని అనుకున్నాడు. అప్పడు ఆ దారిలో ఆ దేశపు రాజు గుఱ్ఱము పైన రావడం చూసాడు. ఆహా ఈ రాజువలె నేను ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచించాడు. ఎంతటి ఆశ్చర్యం వెంటనే అతడు రాజు వలె మారిపోయాడు. అతను గుర్రం పైన ప్రయాణం చేస్తున్నప్పుడు సూర్యుని కిరణాలు ఎక్కువగా అతని పైన పడడంతో ఈ సూర్యుడే రాజుకంటే గొప్పవాడు అని అనుకున్న వెంటనే అతను సూర్యుడు వలె మారిపోయాడు. అలా సూర్యుడు వలె ప్రకాశిస్తున్నప్పుడు ఒక మేఘము వచ్చి భూమి పైన వర్షం కురిపించింది. వర్షము కురవడం వలన నీరు పారుతున్నప్పుడు ఒక పెద్ద రాయి తప్ప మిగతా అన్నీ కూడా ఆ నీటిలో కొట్టుకొని పోతున్నాయి. అప్పుడు ఆ శిల్పి ఆహా ఈ రాయి ఎంతో బలమైనది ఏం వచ్చిన కదలలేదు అని అనుకున్న వెంటనే అతను ఒక పెద్ద రాయిలా మారిపోయాడు ఆ శిల్పి. అప్పుడు ఇంకొక శిల్పి వచ్చి సుత్తిని తీసుకొని వచ్చి ఆ రాయిని చెక్కడం ప్రారంభించాడు. వెంటనే ఆ శిల్పి పని ఎంత గొప్పది అనుకున్నాడు. తాను చేసిన పనిని దేవుడు తనకు ఇచ్చిన స్థానాన్ని మరల సంతోషంగా అంగీకరించాడు. 

 

పరిశుద్ద గ్రంధంలో అపోస్తులుడైన పౌలు తన పత్రికలో సంతుష్టి సాహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై యున్నది అని వ్రాస్తున్నాడు. అనగా మీ యొద్ద ఉన్నవాటిని చాలు అని చెప్తున్నారు. ఇది చదువుతున్న ప్రియమైన వారలారా! మీ యొద్ద ఉన్న దానిని చాలు అని అనుకొనండి. అవి యేసుక్రీస్తు ఇచ్చిన ఆశీర్వదం అయి ఉండవచ్చు, కుటుంబం అయి ఉండవచ్చు, బందువులై వుండవచ్చు కాబట్టి మీ కొరకు ఆయన ఇచ్చిన వాటిని చాలు అని అనుకొనండి. మీ యొద్ద లేని వాటిని గూర్చి బాధ, కృంగుదల వద్దు. ఉన్న దానిలో చాలు అనుకొని కృతజ్ఞతలు తెలపండి. మీరు ఊహించని ఆశీర్వాదములతో దేవుడు మిమ్ములను నింపుతారు. ఆమెన్.

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు

 

ప్రార్ధన అంశం:-

ఆఫీస్ పనిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు విశేష జ్ఞానముతో నింపి వాడుకొనేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet