Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 19.04.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 19-Apr-2022

దిన ధ్యానము(Telugu) 19.04.2022

 

అంశం:- పోషణ యొక్క రహస్యం.

 

"ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగిన ప్రతిలేఖనము" - 2తిమోతికి 3: 16-17

 

బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇది 90 మందిలో చిన్న పిల్లలు, యవ్వనస్తులు మాత్రేమే కాదు పెద్దలను కూడా ఆకట్టుకున్న యడ్వటైజ్మెంట్. ఈ మాటలు చెప్పే వారు ఒక పేరు పొందుకున్న ఒక క్రికెట్ వీరుడు కాబట్టి ఈ మాటలు అన్ని మూలల ధ్వనించాయి. నిజముగా అతని యొక్క శక్తి యొక్క రహస్యము బూస్ట్ నే అని ఆలోచించి చూచినట్లయితే దానికి జవాబు ప్రశ్నార్ధకమే. కారణం ఏమిటి అంటే అనేక కంపెనీలలో దాని యొక్క తయారీ పెరిగిపోయింది. ప్రజలు కొత్తవి రావడంతో పాత వాటిని నెట్టివేస్తున్నారు. ఈ రోజు కొన్ని సంవత్సరాల తరబడి మనము ఉన్నాము అలాగే ప్రత్యేకమైన ఆ పదార్థములు కూడా ఉన్నాయి. ఇంకా చాలా రకములైన పదార్థాములు కూడా వస్తూవున్నాయి. వాటన్నింటిని ప్రజలు 10లో 11 వలె చూడటం మొదలుపెట్టారు. కాని అప్పటి వలె అవే మాటలు పలుకుటకు ఎవ్వరు ముందుకు రావడంలేదు. ఇది మనకు ఒక పాఠం.

 

అపోస్తులుడైన పౌలు తన యవ్వన సేవకుడైన తిమోతి వ్రాస్తున్న పత్రికలో ఒక విషయమును వ్రాయుటను 2వ తిమోతి 3:14-17 వచనాలలో మనం చుస్తున్నాం. అందులో అపోస్తులుడైన పౌలు ఏమి చెబుతున్నారు అంటే బాల్యము నుండి నీవెరిగిన సంగతుల యందు నిలకడగా వుండుము, ప్రతి లేఖనము దైవవేశము వలన కలిగినది. అది ఒక మనుష్యుడు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటకు ప్రయోజనకరమై యున్నవి. అనగా నీవు బాల్యమునుండి తెలుసుకొన్న పరిశుద్ద గ్రంధం ఏదో ఒక అలవాటు చేసుకొన్న కార్యము అని అనుకొనకుండా నిలకడగా వుండుము. అదే నిన్ను అభివృద్ధి చేస్తుంది అవి దైవవేశము వలన కలిగినవి అని ఈ విధముగా పరిశుద్ద గ్రంధంమును గూర్చి చక్కగా వ్రాసారు. 

 

ప్రియమైన వారలారా! మన చేతిలో ఉన్నది పాత పరిశుద్ద గ్రంధమే కాని దానిని ద్యానిస్తున్నప్పుడు మనకు దొరికిన వార్తలు అన్నీ కొత్తవే. మనకు పరిశుద్ద గ్రంధం 10లో 11వది కాదు. అది ఒక్కటే మార్గదర్శి. పరిశుద్ద గ్రంధం ధ్యానించిన వారు రాత్రిం బవళ్ళు ధ్యానిస్తే అది మనలను ఫలించే చెట్టు వలె మారుస్తుంది. క్రైస్తవునిగా జీవించుటకు ఆత్మ బలం చాలా ప్రాముఖ్యం. ఆ బలమును ఇచ్చే ఒకేఒక పోషకం పరిశుద్ద గ్రంధమే. ఈనాడు ఉన్న చిన్నపిల్లలు, యవ్వనులు అనే తరానికి పరిశుద్ద గ్రంధం యొక్క ప్రాముఖ్యతను ప్రకటించే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. బైబిల్ ఇస్ థ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఈ తరం వారికి చెప్పే వారిగా మాత్రమే కాదు దాని ప్రకారం నడుచుకొనే వారిలా మారుదాం.

- బ్రదర్. టి.శంకర్ రాజ్

 

ప్రార్ధనా అంశం:-

మనకు దేవుడు ఇచ్చిన ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహణములు చక్కగా పనిచేసేలా ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet