Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 18.04.2022
Share:

By Village Missionary Movement

Monday, 18-Apr-2022

దిన ధ్యానము(Telugu) 18.04.2022

 

అంశం:- బాగుండాలి అని కోరుకుంటున్నావా.

 

"యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా" - యోహాను 5:6

 

ఈ పత్రికను చదువుతున్న మీకు ఒక ప్రశ్నను అడుగుతాను. బాగుండాలి అని కోరుకుంటున్నారా? అరె ఏంటి ఈ ప్రశ్నను అడుగుతున్నారు ఎవరికి బాగుండాలి అని ఆశ ఉండదు అనే కదా చెప్తారు. 

 

ఒకరోజు నేను సూపర్ మార్కెట్ కు వెళ్లి వస్తున్నప్పుడు ఒక వంతెన పక్కన చాలా మంది బిక్షగాళ్ళు బిక్షమెత్తు కొంటున్నారు. వారిని చూసి దాటివెళ్లిపోవాలి అని అనుకొని చివరిలో కూర్చున్న ఒక వ్యక్తి వింతగా భిక్షమడుగుతున్నాడు. నేను అతనిని గమనించి చూస్తున్నాను. ఆ వ్యక్తి చిరిగిపోయిన వస్త్రాన్ని కొంచం ఎత్తిచూపిస్తున్నాడు. ఎంత భయంకరం అంటే అతని కాళ్లపైన కుళ్ళిన పుండ్లు మరియు వాటిలోనుండి ఎముకలు కనిపిస్తున్నాయి. ఆ సంఘటనను నేను చూడలేకపోయాను. ఆ పుండ్లు చూపిస్తూ అతను బిక్షమడుగుతున్నాడు. నేను అతని దగ్గరకు వెళ్లి అయ్యా నేనొక డాక్టర్, నేను పనిచేస్తున్న హాస్పిటల్ పక్కనే ఉంది. ఎన్నెన్నో మందులు కనుగొనబడింది కాబట్టి రండి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పినప్పుడు అతడు నవ్వుతూ నా పుండ్లు చూపిస్తూ నేను బిక్షమడుగుతున్నాను. వాటిని మీరు బాగుచేస్తే నేను ఆహారం తినడానికి నేను ఏమి చెయ్యాలి అని చెప్పి పక్కనే ఉన్న ఇంకొక బిక్షగాడితో కూడా చెప్తూ నవ్వుతున్నాడు. 

 

మనము కూడా ఇదే పరిస్థితుల్లో ఈ నాటికి కూడా ఉన్నాము. 38 సంవత్సరాలు వ్యాధితో ఉన్న మనుష్యుని చూసి యేసు స్వస్థత పడగోరుచున్నవా అని అడిగారు. కోరికలను, ఆశలను ఆయన నేరవేర్చుటకు ఆయన ఆశ పడుతున్నారు. ఈరోజు దీనిని చదువుతున్న మీకు స్వస్థత పొందాలి, చక్కగా చదవాలి, యేసు కొరకు పరిశుద్ధంగా జీవించాలి అనే ఏయే ఆశలు కలిగి ఉన్నారు. 38 సంవత్సరాలు గా వ్యాధితో ఉన్న ఆ వ్యాధిగ్రస్తుడు విసుకుతో స్వస్థత పొందుకోవాలి అని ఆశ లేనివాడిగా ఉండి ఉండవచ్చు. మీ హృదయ వాంఛలను ఎరిగి యేసుక్రీస్తు మిమ్మల్ని అడుగుతున్నారు నీవు స్వస్థ పడగొరుచున్నావా అని మీ ఆశలను, హృదయ వాంఛలను నెరవేర్చుటకే ఆయన మీ హృదయ తలుపును తట్టుచున్నారు. నా కుమారుడా, కుమార్తె మీకు ఏమి కావాలి అని ఆశ పడుతున్నావు నేను నీ కోసం తలుపు యొద్ద నిలబడి యున్నాను ఇప్పుడే నీ హృదయ తలుపు తెరుస్తావా అని ఆయన నీ కోరికను వినడానికి ఆశ పడుతున్నారు. నీవు ఆలస్యం చెయ్యకుండా నీ కోరికను తెలియజేయుము.

- సిస్టర్. విశాలీ గారు

 

ప్రార్ధన అంశం:

ఆఫీస్ పనులకు ట్యాలి, డిసైనింగ్ పనులు చేసే అనుభవం గలవారిని దేవుడు మన యొద్దకు నడిపించే లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet