Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

అనుదిన ధ్యానము:-17-04-2022
Share:

By Village Missionary Movement

Sunday, 17-Apr-2022

అనుదిన ధ్యానము:-17-04-2022

 

అంశం:- క్రీస్తు పోలిక.

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.

 

 

"మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి". (మత్తయి 5: 44)

 

 

పిల్లలు ఈరోజు స్పెషల్ ఎంటో తెలుసా? ఈస్టర్. యేసు క్రీస్తు యొక్క పునరుత్థానం జరుపుకోవడమే కదా. అవును పిల్లలు యేసయ్య మరణమును జయించి ఇంకా జీవించుచు ఉన్నారు. ఆయన మనతో కూడా ఉన్నారు. ఆయన పొలికను పోలిన జీవితం జీవించుటయే మనం ఆయనకు ఇచ్చే బహుమతి. ఎస్తర్ జీసస్ కు ఏ బహుమతి ఇచ్చిందో తెలుసుకొందమా?.

 

7వ తరగతి చదువుతున్న సుగంది ఇతరులకు వ్యతిరేకంగా ఎత్తి చూపించి గొడవ పడే స్వభావం గలది. అందరిని గోడవల్లోనికి లాగుతుంది. మిగతా పిల్లలు కూడా తనతో గొడవ పడతారు. రిబ్బన్ పట్టుకొని లాగడం, పెన్ను దాచేయడం ఇలా కొంటె పనులు చేయడం. కొన్ని సమయాల్లో చాలా పెద్ద గొడవలు కూడా పడుతుంది. టీచర్ దండించిన కూడా సుగంది మారలేదు. ఒక రోజు ఎస్తేర్ యొక్క సైన్సు నోట్స్ ను చింపేసింది. మిగతా పిల్లలు వలె ఎస్తేర్ సుగందితో గోడవపడలేదు. ఎస్తేర్ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎస్తేర్ తో కలిసి ఉన్న జ్యోతి వేగంగా వచ్చి ఆ సుగందియే నీ నోట్ బుక్ చింపేయడం నేను చూసాను. నువ్వు ఇలా నిశ్శబ్దంగా ఉన్నావు ఏంటి నేను అయితే తిరిగి తన బుక్స్ కూడా చింపేసేదాన్ని అని తిట్టి వెళ్ళిపోయింది. 

 

ఒకరోజు సుగంది కి జ్వరం వచ్చింది కాబట్టి ఒక వారం రోజులు స్కూల్ కి రాలేదు. ఎస్తేర్ సుగంది ని చూడాలి అని తనకు ఇష్టమైన క్రీమ్ బిస్కెట్లు తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. ఎస్తేర్ ను చూసిన వెంటనే సుగంది ఆశ్చర్యపడింది. తన క్లాస్ మేట్స్ ఎవ్వరు తనను చూడటానికి రాలేదు కాని ఎస్తేర్ నా పైన ఎంత ప్రేమగా ఉంది అని తన తప్పును తెలుసుకొని బాధపడింది సుగంది. మరుసటి రోజు సండే స్కూల్ కు వెళ్ళింది. ఎస్తేర్ సుగంది ని చూసిన వెంటనే పరిగెత్తుకొని వచ్చి నీకు జ్వరం తగ్గిందా అని అడిగింది. ఓ తగ్గిపోయింది నిన్న నువ్వు నా కోసం ప్రేయర్ చేయగానే నా జ్వరం అంతా తగ్గిపోయింది. నాకు నీ వలె మంచి పిల్ల వలె ఉండాలి అని ఉంది అందుకే ఇక్కడకు వచ్చాను అని సుగంది చెప్పడంతో ఎస్తేర్ చాలా సంతోషం తో దేవునికి కృతజ్ఞతలు తెలిపింది.

 

ప్రియమైన తమ్ముడు, చెల్లి యేసుని పోలిక అనగా తప్పు చేసినప్పుడు క్షమించి ప్రేమించే లక్షణం ఎస్తేర్ యొద్ద ఉండటం వలన సుగంది యేసయ్యను నమ్మింది. మీరు కూడా యేసుని పొలికలో నడుచుకోవడమే మీరు ఆయనకు ఇచ్చే బహుమతి. ఓకేనా. Happy Easter.

 

శ్రీమతి.జీవా విజయ్ గారు.

 

 

 

తమిళ్ కోరకు +91 9444011864, ఇంగ్లీష్ కొరకు +91 8610984002 , హిందీ కొరకు +91 9385810496 , తెలుగు కోసం+91 9442493250.

 

ఈమెయిల్: dailydevotion@vmm.org.in Androidapp: https://play.google.com/store/apps/details?id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 9442493250. 

ఈ దిన ధ్యాన సందే శమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ ద్వారా పొందుటకు 9444011864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet