Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.04.2022
Share:

By Village Missionary Movement

Friday, 15-Apr-2022

దిన ధ్యానము(Telugu) 15.04.2022

 

అంశం:- సిలువను మోసిన సీమోను.

 

"కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతముచేసిరి” - మార్కు 15: 21

 

సైనికుల సమూహము ప్రభువైన యేసుక్రీస్తును పరిహాసం చేసిన తరువాత ఆయనను సిలువ వేయుటకు తీసుకొని వెళ్లారు. వెళ్తున్న దారిలో యేసుక్రీస్తు మోస్తున్న సిలువను మోయుటకు కురేనీయుడైన సీమోనను బలవంతం చేశారు.యేసుక్రీస్తు సిలువ మార్గంలో మౌనముగా ఉన్నట్లే సీమోను కూడా బదులుగా ఏదియు మాట్లాడక యేసుక్రీస్తు యొక్క సిలువను మోస్తూ యేసు క్రీస్తునకు కొంచం విశ్రమింపచేసాడు. యేసు క్రీస్తు సిలువను మోస్తున్న మార్గంలో అనేకులు ఉన్నప్పటికీ ఆ సైనికుల కన్నులు సీమోను పైన మాత్రమే పడినట్లు మీరు ఉండే స్థలంలో లేదా ఉద్యోగంలో, పనిచేస్తున్న స్థలంలో అనేకులు ఉన్నప్పటికీ యదార్థంగా నడిచే మీరు మాత్రమే యేసుక్రీస్తు కొరకు శ్రమలు అనుభవిస్తున్నారా? భారమైన సిలువను మోస్తున్నారా? బాధపడవద్దు.

 

తామున్న స్థలములో ఒంటరి వ్యక్తిగా శ్రమలు అనుభవించిన దానియేలు, యోబు, యోసేపు వంటి వారిని విడిపించి ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లిన ప్రభువు తొందరలోనే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తారు. అది మాత్రమే కాదు ప్రభువు యొక్క సిలువను కొంచం సేపు మోసిన సీమోను పిల్లలు అలెక్సజాన్డెర్ మరియు రూప్ అనే వారిలో ఒకరు సంఘ నాయకుడిగా మరియొకరు ప్రభుత్వంలో ఉన్నత మైన వాడిగా హెచ్చింప బడినట్లు సంఘ చరిత్ర చెబుతోంది. కావున ఈ గొప్ప శుక్రవారం నాడు అనగా గుడ్ ఫ్రైడే నాడు మీ యొక్క సిలువను ప్రతి రోజు సంతోషంగా మోయుటకు సమర్పించుకొనండి. సీమోను సంతతి వలె మీ సంతతిని కూడా యేసు క్రీస్తు హెచ్చిస్తారు. అనేకమైన వజ్రములు కలిగిన ప్రకాశవంతమైన కిరీటం పరలోకంలో మీ కొరకు ఎదురు చూస్తుంది.  

 

గుర్తింపు: ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

- పౌలు

 

ప్రార్ధన అంశం:-

వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఈమెయిల్ ద్వారా దేవుని యొక్క మాటలను చదువుతున్న వారు, వింటున్న వారు దేవుని కొరకు ఫలించు లాగున ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al betcio giriş betcio padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet