By Village Missionary Movement
Thursday, 14-Apr-2022దిన ధ్యానము(Telugu) 14.04.2022
అంశం:- అప్పగించిన యేసు.
"తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను" - లూకా 23:46
యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 7వ మాట.
ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక మంచి నమూనా. యేసుక్రీస్తు. ప్రభువు సిలువలో వ్రేలాడిన రోజు మాత్రమే కాదు ప్రతి రోజు తన యొక్క కార్యములను తండ్రి చేతికి అప్పగించి జీవించారు అనే పరిశుద్ద గ్రంధంలో. మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమిపైన జీవించే కాలంలో ప్రతి రోజుని తండ్రి చేతికి అప్పగించారు. భూమిపైన చేసే రోజువారీ పనులు, తన యొక్క శిష్యులు, వాక్యమును వినిన విశ్వాసులు అనే అన్ని విషయాలు తండ్రి చేతికి అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడిన ముందు రోజు రాత్రి రోజంతా తండ్రి వైపు చూస్తూ ప్రార్ధించారు అనేది దేవుని గ్రంధంలో మనం చూడగలం. ఎంతటి ప్రత్యేకత.
తనను గూర్చిన తండ్రి చిత్తం అయిన సిలువ వేయబడుట అనేదానిని నెరవేర్చారు. యేసుక్రీస్తేలో ఉన్న ఆత్మను తొలగించుట ఎవరికి సాధ్యం కాదు. అందువలన యేసుక్రీస్తే తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ప్రాణమును విడిచారు అని పరిశుద్ద గ్రంధం ద్వారా తెలుసుకొంటున్నాం. ప్రతి క్షణం యేసుక్రీస్తు తనను తండ్రి చేతికి అప్పగించుకొని ఒక అద్భుతమైన జీవితమును ఈ లోకంలో జీవించి పూర్తిచేశారు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీ యొక్క స్థితి ఏమిటి? ప్రార్ధనలో దేవుని చేతికి దేనిని అప్పగిస్తున్నారు. మీ జీవితమును ఎప్పుడైనా దేవుని చేతికి అప్పగించారా? మీ పిల్లల జీవితమును అప్పగించారా? మనలను ఆయన చేతికి అప్పగించుకొన్నప్పుడు ఆయన పాపపు మరణము నుండి మనలను రక్షించి ఒక నూతన జీవితమును మనకు ఇచ్చి రక్షణ ఆనందముతో జీవింప చేసి భవిష్యత్తులో నిత్య జీవం మనకు ఇస్తారు. మీ ఆశ, కోరిక అన్నింటినీ విడువక యేసుక్రీస్తు వలె సమస్తమును తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించుకొనండి. పాపము నుండి రక్షణను మరియు నిత్య జీవమును పొందుకొనండి.
- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు.
ప్రార్ధన అంశం:-
తమిళం, ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడ, ఒరియా, మళయాళం మరియు పంజాబీ భాషల్లో బయలు పడుతున్న దిన ధ్యాన సందేశముల ద్వారా ప్రజలు అందరు క్రీస్తు లోనికి వచ్చులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250