Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 13.04.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 13-Apr-2022

దిన ధ్యానము(Telugu) 13.04.2022

 

అంశం:- సమాప్తమైనది.

 

"యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను" - యోహాను 19:30

 

యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆరవ మాట:- మొదటి తరము వారిలో దేవునితో కూడా నడచిన నోవహు. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవుడు ఈ లోకంలో నోవహు గూర్చిన తన ప్రణాలికను నెరవేర్చారు. నోవహు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మనం ఏరిగియున్న ఈ లోకంలో జీవించిన కాలమంతా తండ్రి యొక్క చిత్తాన్ని చేశారు. తండ్రియైన దేవుడు తనకు ఏమి చేయాలి అని చూపిస్తున్నారో లేదా తెలియజీస్తున్నారో అది మాత్రమే చేసి నెరవేర్చారు. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చుటకు లక్ష్యం ఏమిటి అంటే! ఈ లోకంలో పుట్టిన పుట్టబోయే ప్రతి ఒక్కరి పాపములు, శాపములు, వ్యాధులను తొలగించి వారిని రక్షించుటకు ఆ త్యాగము కొరకు తన ప్రాణమునే ఇచ్చుటకు వచ్చారు. యేసు రక్తము మనలను ప్రతీ పాపమునుండి పవిత్రులనుగా చేయును అని 1యోహాను పత్రిక 1:7 లో మనం చదువుతున్నాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యాసనములను వహించెను అని యెషయా 53:4 వ వచనంలో చదువుతున్నాం. తండ్రి చిత్తమును తన మరరణం వరకు నెరవేర్చిన యేసు తన శరీరంలో అనేక శ్రమలు ఉన్నప్పటికీ తన హృదయంలో సంపూర్ణంగా సమాప్తమైనది అని చెప్పి తన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించారు. 

 

నాకు ప్రియమైన వారలారా ఆయన ముందుగా ఏర్పరచుకున్న వారితో దేవుడు తన పనిని నెరవేర్చుతారు. నూవహునుగూర్చిన ప్రణాళికను దేవుడు నోవహు ద్వారా నెరవేర్చాలని అనుకున్నప్పుడు నోవహు దానికి లోబడ్డాడు. అందువలన దేవుని భక్తి గల సంతతిని అభివృద్ధి చేయుటకు భూమిపై ఉన్న సకల జీవులను అభివృద్ధి చేయుటకు నోవాహు కారణమాయ్యాడు. కాని యేసుక్రీస్తు యొక్క విధేయత వలన ప్రపంచమంతా రక్షింపబడింది అనేది ఎంతగొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. ఈరోజు మన విదేయత గురించి మనం కొంచం ఆలోచించి చూద్దాం మన విదేయత వలన మన కుటుంబం రక్షించబడుతుందా? మనకు సమీపంలో ఉన్నవారు రక్షింపబడతారా? మన సొంతవారు రక్షించబడతారా? యేసుని ఎరుగని అన్యజనులు రక్షించబడతారా? యేసుక్రీస్తు తండ్రి చిత్తమును నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పినప్పుడు మనుష్యులకు రక్షణ ప్రారంభమైనది. మనం మన యొక్క బాధ్యతలను నెరవేర్చి సమాప్తమైనది అని చెప్పి మన కన్నుమూసినప్పుడు మన వెనక వచ్చేవారు భక్తి గల సంతతి వాలె వస్తారా? అందుకు మనం ఈ రోజుల్లోనే దేవుని చిత్తమును నెరవేర్చుటకు ప్రయత్నిద్దామా? యేసుని మాటలకు లోబడుటకు మీకు ఒక భాగం ఉందా? 

- సహోదరుడు. పున్మని పాల్ గారు.

 

ప్రార్ధనా అంశం:-  

మోక్ష ప్రయాణం దిన ధ్యాన పత్రికలను చదివినవారు సత్యంలో ఎదిగి సాక్షిగా జీవించేటట్లు ప్రార్దిద్దాం. 

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet