Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.04.2022
Share:

By Village Missionary Movement

Monday, 11-Apr-2022

దిన ధ్యానము(Telugu) 11.04.2022 (Kids Special)

 

అంశం:- దేవుడు ఎక్కడ?

 

"ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము" - మత్తయి 27:46

 

యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన నాల్గవ మాట. క్రిస్టియన్ మరియు మిషనరీ కూటం అనే గ్లోబల్ మిషనరీ ఉద్యమాన్ని స్థాపించిన వారు శ్రీ ఏ.బి సిన్ సన్ గారు. ఇతని యొక్క జీవిత కథను ఏ.డబ్ల్యు. టోసర్ వ్రాసిన వింగ్స్ ప్రైడ్ అనే అద్భుతమైన పుస్తకంలో చదవవచ్చు. రక్షించబడి సేవచేయుట ప్రారంభించిన సిమ్ సన్ యొక్క జీవితంలో ఎదుగుదల మిక్కిలి వేగవంతంగా ఉండేది. కాని ఒక నిర్దిష్ట సమయంలో శరీర బలహీనతతో సహా ఆత్మీయ చీకటి వంటిది ఒకటి అతని జీవితంలోనికి వచ్చింది. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివి అనే కేక అతని హృదయంలో ఉండేది. ప్రార్థన, బైబిల్ ధ్యానము వంటివి ఏవి కూడా ఆ సమయంలో అతనికి సహాయం చెయ్యలేదు. ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న అతను మరల తిరిగి ఎదగడానికి చాలా రోజులు పట్టింది. ఇలా దేవుని ప్రసన్నత లేకుండా లేదా దేవుడు లేడు అని అనిపించే సమయాలు క్రైస్తవుని జీవితంలో ఒక భాగం అని ఏ. డబ్ల్యు. టోసర్ వ్రాసారు. విశేషంగా దేవున్ని చాలా ఎక్కువగా ప్రేమించి ఆయన కొరకు ఏదైనా చేసే వారి జీవితాల్లో ఇది సహజం అన్నారు. మనం, మన భావోద్వేగాలు పరిస్థితులను అర్థం చేసుకునే విధంగా విశ్వాసంతో దేవుని పైన ఆధారపడడానికి మరియు అధ్యయనం చెయ్యడానికి మనకు సహాయపడే క్షణాలే ఇవి. మనుష్యునికి దేవునికి మధ్య ఉన్న సంబంధమును దాని విలువలను తెలియజేసే పుస్తకం కీర్తనలు గ్రంధం. కీర్తనలు 16:11 లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అర్థం చేసుకొని వ్రాసిన దావీదు రాజు కీర్తనలు 22:1 లో నా దేవా నా దేవా నీవేల నా చేయి విడచితివి అని కేక వేస్తున్నాడు. సంఘ చరిత్రను తిరిగి చూస్తే క్రైస్తవ తల్లిదండ్రులు అనేకులు ఈ అనుభవాలు తమ జీవితంలో ఉండడం అనేది సాక్ష్యంగా చెబుతారు. దేవుని ముఖము దాయబడే ఈ కఠినమైన అనుభవమును మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో అనుభవించారు. కీర్తనలు 22:1లో గల మాటను చెప్పి ఆయన కూడా కేక వేశారు. అందువలన ఆయనకు మన అనుభవాలు అర్థం అవుతాయి. 

 

ప్రియమైన వారలారా! ఈ విధముగా ఆత్మీయ చీకటి మన జీతంలో కలిగినప్పుడు దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. ఇతర విశ్వాసులతో ఉన్న ఐక్యతలో దేవుని ముఖ ప్రకాశం శీఘ్రముగా మన మీద ప్రకాశించును.

- బ్రదర్. జె.సంతోష్ గారు

 

ప్రార్ధన అంశం:-

ఆఫీసు పనికి సంబంధించిన కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ కొనబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

ఈమెయిల్: reachvmm@gmail.com

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al