By Village Missionary Movement
Sunday, 10-Apr-2022దిన ధ్యానము(Telugu) 10.04.2022 (Kids Special)
అంశం:- గిఫ్ట్ కావాలా?
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
"ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది" - ప్రకటన గ్రంథం 22:12
హాలో పిల్లలు సంగీతం అంటేనే నచ్చని వారు ఎవ్వరు ఉండరు కదా. కీబోర్డ్, డ్రమ్ సెట్, గిటార్ వంటి రకరకాల సంగీత వాయిద్యాలు వాయించడం అంటే మీకు చాలా ఇష్టం కదా. ప్రస్తుతం మీలో చాలా మంది వాయిద్యాలు నేర్చుకొంటున్నారు వెరీ గుడ్.
మీలానే రాజన్ అనే తమ్ముడికి కీబోర్డ్ నేర్చుకోవాలి అని ఆశ. కాని వాళ్ళ ఇంట్లో కీబోర్డ్ కొనడానికి మరియు నేర్చుకోవడానికి ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. ఒకరోజు రాజన్ తన నాన్నతో కలిసి మార్కెట్ కి వెళ్ళాడు. అక్కడ సంగీత వాయిద్యాలు అమ్ముతున్న దుకాణం ను ఆశతో చూస్తున్నాడు. ఏంటి నాన్న చాలా సేపటి నుండి ఆలోచిస్తూనే ఉన్నావు అని ఆ దుకాణం యొక్క యజమాని అడిగాడు. అప్పుడు రాజన్ నాకు కీబోర్డ్ నేర్చుకోవాలి అని ఆశ ఉంది కాని అని చెప్తున్నప్పుడే ఆ దుకాణం యొక్క యజమాని ప్రతి రోజు సాయంత్రం మా ఇంటికి రా నేను నేర్పిస్తాను అని తన ఇంటి అడ్రెస్ ఇచ్చారు. నేను ఫీజుకు బదులుగా ఉదయాన్నే మీ దుకాణానికి వచ్చి శుభ్రపరుస్తాను అని రాజన్ ఆ యాజమాని తో చెప్పాడు. అతడు సరే అని చెప్పడంతో రాజన్ సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయమున తాళం తీసుకొని దుకాణం శుభ్రపరచి అన్ని చక్కగా పెట్టాడు. దుకాణం నుండి వచ్చిన వెంటనే స్కూల్ కి వెళ్ళేవాడు. ఒక రోజు ఉదయమున వేగంగానే దుకాణ దారుడు వచ్చేసాడు. మధురమైన రాగములతో కూడిన రాగం గాలిలో తేలియాడుతూ వచ్చింది. వినుటకు చక్కగ మరియు మధురంగా ఉన్నది. ఎవరు వాయిస్తున్నారు అని చూస్తే రాజన్. చాలా చక్కగా కీబోర్డ్ వాయిస్తున్నాడు. దుకాణ దారుడు రాగానే భయపడి నిలబడ్డాడు. ఇదంతా నేను ఇంకా నీకు నేర్పించలేదు కదా నీకు నేను ఏ శిక్ష విధించబోతున్నానో చూడు అని చెప్పగానే రాజన్ ఏడుస్తూ నిలబడ్డాడు. అతడు నవ్వుతూ నీకు ఏ కీబోర్డ్ కావాలో అది తీసుకో అదే నేను నీకు ఇచ్చే బహుమతి అని దుకాణ దారుడు చెప్పడంతో రాజన్ మొఖం ప్రకాశ వంతమైన నక్షత్రం వలె ప్రకాశించింది. ఏదో ఒక విధంగా తన ప్రతిభను పెంచుకోవాలి అని ప్రయాసపడిన రాజన్ కు బహుమతి లభించింది అంతే కదా.
చిన్న పిల్లలు మీరు కూడా యేసయ్య మీకు ఇచ్చిన ప్రతిబలను పెంచుకోవాలి. సమయం లేదు సౌకర్యం లేదు అని ఏవేవో చెప్పకూడదు. ప్రతిబలను ఉపయోగించినప్పుడు దానికి తగిన బహుమతి యేసయ్య నిశ్చయంగా ఇస్తారు. ఓకేనా.
- సిస్టర్. బ్యూలా.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250