Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.04.2022
Share:

By Village Missionary Movement

Saturday, 09-Apr-2022

దిన ధ్యానము(Telugu) 09.04.2022

అంశం:-  ఇదిగో నీ తల్లి.

" అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను” - యోహాను 19:26

యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మూడవ మాట. యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు మాట్లాడిన ప్రతి మాటలో ఒక గొప్ప అర్ధం దాగి ఉంది. సాధారణముగా ఒకరు మరణించే పరిస్థితుల్లో తన కుటుంబ బాధ్యతలు అర్హులైన వారికి అప్పగిస్తారు. తండ్రి ఆయితే తన భార్యకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు అయితే తన పిల్లలను చూసుకొనే బాధ్యతను తన పెద్ద కుమారుడికి అప్పగిస్తారు. అదే విధంగా మన దయామయుడైన యేసుక్రీస్తు భర్త లేని తన తల్లియైన మరియను చూసుకొనుటకు ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించారు. ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమిపై తండ్రి తనకు అప్పగించిన సమస్తమును పూర్తిగా నెరవేర్చారు యేసుక్రీస్తు. ఆ క్రూరమైన వేదనలు మధ్యలో కూడా కుటుంబంలో తనకు ఉన్న బాధ్యతలు జాగ్రత్తతో నెరవేర్చి పూర్తి చేయడం మనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప భాగ్యం మరియకు దొరికింది. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తుని తన గర్భంలో మోసి కని పెంచిన గొప్ప భాగ్యం. కాని నీ హృదయము లోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవుననే ఒక దీర్ఘదర్శనం నెరవేరుట కొరకు యేసుక్రీస్తు సిలువపైన వ్రేలాడుట చూసి ఓర్చుకొన లేక కన్నీరు కార్చింది మరియ. ఇకపై తనను ఎవరూ చూసుకొంటారు అనే ఆలోచన మరియకు ఉందొ లేదో కాని ఘోరమైన వేదనల మధ్యలో యేసుక్రీస్తు కు ఆ ఆలోచన ఉంది. 

యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఆయన శిష్యులలో అనేకులు పారిపోయారు. యోహాను మాత్రం మరియ దగ్గర నిలబడి ఉన్నాడు. యెహోను మరియను చూసుకొనుటకు అర్హుడు అని ఆయన ఎరిగి మరియను ఆయనకు అప్పగించారు. తల్లిదండ్రులను గౌరవించుటలో ఒక ఉదాహరణ యేసుక్రీస్తే. 

ప్రియమైన వారలారా! మనకు కూడా ఈ బాధ్యత ఉంది దానిని మనం కచ్చితంగా నెరవేర్చాలి. ఈనాటి కాలంలో పిల్లలు, వివాహం, ఉద్యోగం అని దూరదేశమునకు అనేకులు వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులను గౌరవించడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని అంగీకరించుటకు మనస్సు రావడం లేదు. కొంత మంది వారి యొద్దనుండి ఆస్తులు తీసుకొని వారిని పూర్తిగా మరచిపోతున్నారు. ఆశీర్వాదంతో ముడి పడి ఉన్న ఏకైక ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనేదే. మనం యేసుక్రీస్తు ను వెంబడించి ఆశీర్వాదకరమైన సంతతి వలె ఈ లోకంలో జీవిద్దాం. 
-    శ్రీమతి. భువనా ధనబలన్ గారు.

ప్రార్ధన అంశం:-
కన్ మానియ కేల్ అనగా యవ్వనురాలా విను అనే ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 6:00-6:30 వరకు జరుగుచున్నది. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి యవ్వన స్త్రీని దేవుడు ముట్టి రక్షించుకొనేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al