Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.04.2022
Share:

By Village Missionary Movement

Thursday, 07-Apr-2022

దిన ధ్యానము(Telugu) 07.04.2022

అంశం:-  మనం గ్రహింపు గల వారమా? 

"యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను" - లూకా 23:34

యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట. యేసుక్రీస్తు కు సిలువ వేయుటకు కారణం ఎవరు లేదా ఏమిటి అని ఆలోచిస్తే యేషయా గ్రంధం 53 వ అధ్యాయం 5వ వచనంలో సమాదానమును చూడవచ్చు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. అందువలన నాతో, మీతో సహా ఈలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సిలువలో శ్రమలు అనుభవించుటకు కారణమై యున్నాము. అదే సమయంలో యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఎవరి కొరకు మాట్లాడుతున్నారు. అప్పటి కాలంలో జీవించే యూదులు ముఖ్యంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసుక్రీస్తుని ప్లాన్ చేసి సిలువ వేశారు. ఇస్కరియోతు యూదాకు డబ్బులు ఇవ్వడం మొదలు కొని పిలాతును అంగీకరించేలా చేసేవరకు వీరే కారణం అని మనం అనుకుంటున్నాం. దేవున్ని వెతికి వాక్యమును అన్వేషిస్తున్న ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు కూడా యేసుక్రీస్తు విషయంలో వారు చేసినది నూటికి నూరు శాతం సరైనది అనుకొన్నారు. అందువలననే వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు అని యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొద్ద వీరిని క్షమించమని ప్రార్ధించారు. 

మన ప్రభువు సిలువలో పలికిన పైన చూసిన మాట మనకు బోధించేది ఏమిటి అంటే మనం మన దృష్టిలో నూటికి నూరు శాతం సరైనది అనుకొనే కొన్ని విషయాలు దేవుని దృష్టికి సరైనవి కాకపోవచ్చు. ఇటువంటి విషయాల్లో దేవుడు మనలను దయతో క్షమిస్తారు. అయితే మనం ఇటువంటి కార్యములలో గ్రహింపు లేని వారమైన ఎరుగని వారమైన యున్నామా అని మనలను మనమే పరీక్షించు కోవాలి. 

నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అని కీర్తనాకారుడు కీర్తనలు 139: 24లో ప్రార్ధించిన విధముగా మనము కూడా ప్రార్ధించాలి. ప్రాముఖ్యంగా మనము చేసే ఏ పనైనా సరే మన జ్ఞానంతో కాదు గాని దేవుని దృష్టికి సరైనదేనా అని ఆలోచించి నడుచుకోవాలి. దీనిని గ్రహించుకొనే హృదయంతో కోరుకోవాలి. ఇంకా పరిశుద్ద గ్రంధం ద్వారా, ఇతరుల ద్వారా మన యొక్క లోటులను తెలుసుకొని సరి చేసుకొనుటకు ప్రయాసపడాలి. 
-    బ్రదర్. జె. సంతోష్ గారు.

ప్రార్ధనా అంశం:- 
ప్రతి రోజు వేకువజామున 5 గంటలకు యూట్యూబ్లో లైవ్ సర్వీసులో పాలు పొందుకున్నవారు స్వస్థత పొందుకొను లాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet kingbetting kingbetting giriş lunabet lunabet giriş rulobet betpas atlasbet grandpashabet