Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.04.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 06-Apr-2022

దిన ధ్యానము(Telugu) 06.04.2022

అంశం:-  ఎంతటి త్యాగం.

"మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము" - 1యోహాను 3:16

మన అందరికి తెలిసిన ఒక చిత్రం ప్రార్ధించే చేతులు. మనలో చాలా మందికి దాని వెనక ఉన్న హృదయాన్ని కరిగించి సంఘటన తెలుసా తెలియదా అనేది నాకు తెలియదు. 15వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబంలో 18 మంది పిల్లలు ఉండేవారు. వారి యొక్క తండ్రి ఒక బంగారం పని చేసేవాడు. ప్రతి రోజు తన పిల్లలకు ఆహారం పెట్టటం చాలా కష్టంగా ఉండేది. ఈ పరిస్థితుల్లో అల్ బ్రెడ్ జ్యురల్ మరియు అల్ బ్రెడ్ జ్యురన్ అనే ఇద్దరు పిల్లలకు ఒక పెద్ద చిత్ర లేక అకాడమీలో చదువుకోవాలి అని ఆశ. తన తండ్రి కచ్చితంగా చదివించలేరు అని వారికి తెలుసు.అందువలన ఇద్దరు ఒక తీర్మానం తీసుకొని ఒక నాణెమును తీసుకొని బొమ్మ, బొరుసు వేసి చూసి ఎవరు గెలిస్తే వారు మొదట నాలుగు సంవత్సరాలు చదువుకోవాలి. ఆ విద్యకు కావలసిన ఖర్చులు ఇంకొకరు దగ్గరలో ఉన్న గనుల్లో పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అల్ బ్రెడ్ జ్యురల్ కు అవకాశం దొరికింది అతడు చదువుకోవడానికి వెళ్ళాడు. అల్ బ్రెడ్ జ్యురన్ నాలుగు సంవత్సరాలు ఆ ప్రమాద కరమైన గనుల్లో పనిచేసి తన సహోదరునికి సహాయం చేసాడు. నాలుగు సంవత్సరాలు తరువాత ఒక ఉత్తమ చిత్రకారుడిగా అల్ బ్రెడ్ జ్యురల్ తిరిగి వచ్చినప్పుడు వారి కుటుంబం అంతా సంతోషంతో విందు జరుపు కొన్నారు.విందు ముగిసిన తరువాత అల్ బ్రెడ్ లేచి జ్యురల్ లేచి అన్నయ్య మీరు చిత్ర లేఖ అకాడమీకి చదువుకొనుటకు వెళ్ళండి నేను డబ్బు సహాయం చేస్తాను అన్నాడు. తమ్ముడు నేను నాలుగు సంవత్సరాలు గనుల్లో పని చేయడం వలన నా చేతి వ్రేళ్ళు చితికి పోయాయి కాబట్టి అర్ధరైటీస్ అనే ఎముకల వ్యాధి కూడా నాకు వచ్చింది. అందువలన నేను ఒక చిన్న పెన్ను గాని బ్రెష్ గాని పట్టుకోలేను అని అల్ బ్రెడ్ జ్యురన్ కన్నీరు కారుస్తూ చెప్పాడు. అన్నయ్యకు గౌరవంతో చితికిన వ్రేళ్ళ యొక్క చిత్రం గీశాడు అల్ బ్రెడ్ జ్యురల్. అదే ప్రపంచ వ్యాప్తంగా ప్రార్ధించే చేతులు ఉన్న చిత్రం. 

మనము కూడా మన పాపములు కొరకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపడిన నలుగగొట్టబడిన సిలువలో మేకులతో దిగగొట్టుటకు అప్పగించుకొన్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగం గుర్తు చేసుకొందాం. సిలువను మోసిన త్యాగమూర్తి అనే చిత్రాన్ని చిత్రీకరించి గోడపైన వ్రేలాడదీయడం కాదు గాని మన హృదయమును ఆయనకు ఇచ్చి అనేకులకు ఆయన ప్రేమను పంచుదాం. ఆమెన్.
-    శ్రీమతి. జాస్మిన్ పాల్.

ప్రార్ధనా అంశం:-
మన పరిచర్య ద్వారా టీ. వీ లో ప్రసారం అవుతున్న కార్యములు చూస్తున్న ప్రజలు ఆశీర్వదించబడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al