Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.04.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 05-Apr-2022

దిన ధ్యానము(Telugu) 05.04.2022

అంశం:-  రక్తంలో వ్రాయబడింది.

"అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక" - గలతియులకు 6:14

ఒక పెద్ద వాహన ప్రమాదంలో అనేకులు చిక్కుకొని ప్రాణాలతో పోరాడుతున్నారు. అగ్నిమాపక దళం, సహాయకులు మరియు అంబులెన్స్ లు ఆ స్థలానికి చేరుకున్నాయి. ఆ విపత్తుకు గురైన ఆ వాహనం యొక్క ఒక మూలలో ఒక మాట వ్రాయబడి ఉండుట చూసారు. ఆ మాట వారి కన్నుల నుండి కన్నీరు కారెలా చేసింది. ఆ ప్రమాదంలో చిక్కుకొన్న ఒకతను తాను చనిపోబోతున్నాను అని ఎరిగి తన నుండి కారుతున్న రక్తంను తీసి తన ముందు ఉన్న సీటు పై నా భార్య పిల్లలను నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని వ్రాసారు. ఒక మనుష్యుడు తన కుటుంబం పైన చూపిన ప్రేమను చూసి మనం ఆశ్చర్య పడుతున్నాం.

యేసుక్రీస్తు పాపుల పైన చూపిన ప్రేమను తన రక్తం అంతా కార్చి బయలు పరిచారు. ఎంత గొప్ప త్యాగం. అపోస్తు లుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక ముగింపులో క్రీస్తు కొరకు తన జీవితంలో అనుభవించిన శ్రమలను వ్రాసారు. ఆ మతాది కారుల ఉన్నతమైన జీవితమునకు  గుర్తింపుగా ఉన్న ఆ మత చట్టాలు కంటే యేసుక్రీస్తు సిలువ మరణం మరియు ఫునరుత్థానం ప్రాముఖ్యతను వహించాయి అని బోధించటం వలన అనేక మార్లు శిక్షించబడ్డారు. పౌలు తన సంరక్షణ కొరకు సిలువ మరణమును తృణీకరించి మాట్లాడలేదు. తన సొంత జీవితమును సిలువ మార్గంలో జోడించి యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తం ద్వారా దేవుడు మన మీద ఉంచిన ప్రేమను వ్రాసారు అని బహిరంగముగా సందేహమునకు చోటు ఇయ్యక స్పష్టంగా తెలియ జేసారు. 

ప్రియమైన వారలారా! మన సత్క్రియలు, నీతి అంతా పాడైపోయే వస్త్రం అని ఎరిగియున్నాం. క్రీస్తు మనపై చూపిన ప్రేమను తెలియపరుచుటకు సిలువలో రక్తం కార్చారు. ఆ కల్వరి త్యాగమును చూసిన వారమై ఆయన ప్రేమను ఇతర మనుష్యులకు బయలుపరిచి జీవించే జీవితంను మనం జీవిద్దాం. ఆయన కొరకు మనం అనుభవించే శ్రమలు సహించుటకు తీర్మానించు కుందాం. క్రీస్తు మనలను నడిపించుటకు మనలను మనం ఆయనకు సమర్పించుకొందాం. క్రీస్తు యొక్క సిలువను గూర్చి కాక మరి దేనిని గూర్చి అతిశయించ కుందుము గాక!. 
-    సిస్టర్. ఏ. బ్యూలా గారు.

ప్రార్ధన అంశం:-
మన సేవ తరుపున టి.వీ లో ప్రసారం అవుతున్న దేవుని మాటలు మూలంగా అనేకులు క్రీస్తు కొరకు ఉత్సాహంగా సాగేటట్లు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet