Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.04.2022
Share:

By Village Missionary Movement

Friday, 01-Apr-2022

దిన ధ్యానము(Telugu) 01.04.2022

అంశం:  క్రీస్తు అనుభవించే శ్రమలలో దేవుని ప్రేమ.

"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3:16

1963వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు అయిన జాన్ కెనడి కాల్చి చంపబడ్డారు. ఆ తరువాత జరిగిన అధ్యక్షుడి పోటీలో తన సహోదరుడు అయిన రాబర్ట్ కెనడి పోటీలో పాల్గొన్నారు. ఒక రోజు ఎన్నికల సమావేశంలో అతను మాట్లాడుతున్నప్పుడు కాల్చబడి కులాద్రోయబడ్డారు. అతను రక్తపు మడుగులో వేదనలో అల్లాడుతు అతని కన్నులు మూయబడి ఉన్నాయి. ఆ సమయంలో కూడా తన చుట్టూ వున్న స్నేహితులను ముట్టి చూసి అందరూ సురక్షితంగా ఉన్నారా అని ఆడిగారంట. ఎంత సంరక్షణ చూడండి. కొంత సమయం తరువాత ఆయన కూడా మరణించారు. ఏ లోకపు మనుష్యుడైన అతనే అంత ప్రేమ కలిగి వున్నారు అంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పది అనేది తెలుసుకొనుటకే యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు. 

యేసుక్రీస్తు ఎంతటి శ్రమలు అనుభవించారో కొంచం ఆలోచించి చూచినట్లయితే ఆయన మనకోరకై కొరడా దెబ్బలకు తన్ను తాను అప్పగించు కొన్నారు. రోమియులు శిక్షించుటకు ఉపయోగించే కొరడా యొక్క చివరిలో ఒక మేకు మరియు ఒక ఇనుప గుండు అతికించిబడి ఉంటుంది. దానితో కొట్టిన ప్రతి సారి యేసుక్రీస్తు యొక్క మాంసము చినిగి  రక్తం కారుతుంది. ఆయన వీపు దున్నబడిన నేల వలె మారింది. ముండ్ల కిరీటం తలపై పెట్టి కొట్టారు. తలపై పెట్టిన పదునైన ముండ్ల కిరీటం చిత్ర హింసకు గురిచేసింది. అరికాలు. మొదలుకొని నడినెత్తి వరకు యేసుక్రీస్తు గాయపడ్డారు. 

ప్రియమైన వారలారా! మనం ఈ పాపం నుండి శాపం నుండి ఈ వ్యాధుల నుండి రక్షింపబడు లాగున మన కొరకు సిలువలో తనకు తానే అప్పగించు కొన్నారు. యేసుక్రీస్తు యొక్క ఇన్ని శ్రమలకు గల కారణం తండ్రి అయిన దేవుడు మన మీద ఉంచిన ప్రేమ మాత్రమే. యేసుక్రీస్తు యొక్క శ్రమల ముందు మన శ్రమలు మిక్కిలి అల్పమైనవి. యేసుక్రీస్తు శ్రమలను సహించు నిమిత్తము తండ్రి యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోన గలుగుతున్నాం. అదే విధంగా మనకు మన కుటుంబం నుండో లేదా మన బంధువుల నుండో లేదా స్నేహితుల నుండో శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం సహించినప్పుడు దాని మూలముగా క్రీస్తు యొక్క ప్రేమను వారు కూడా అర్థం చేసుకొంటారు. శ్రమలను సహిస్తూ జీవించుటకు సమర్పించుకొందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. 
-    బ్రదర్. శివ గారు.

ప్రార్ధన అంశం:-
ఈ నెల అంతా జరిగే పరిచర్యలో దేవుడు తన యొక్క మహిమను బయలు పరుచులాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet