By Village Missionary Movement
Thursday, 31-Mar-2022దిన ధ్యానము(Telugu) 31.03.2022
అంశం: నీ పక్షపు వారగుదురు.
"నీకు విరోధముగా గుంపుకూడువారు నీ పక్షపు వారగు దురు" - యెషయా 54:15
ఒక ఊరిలో ధన బలం, అధికార బలం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన పెద్ద సహోదరునికి, తన పిల్లలకు విరోధముగా నడుచుకొంటూ వారి కుటుంబమునకు కీడు కలుగ జేస్తూనే ఉండేవాడు. వారిని అవమాన పరచడం, వారితో కారణం లేకుండా గొడవ పడడం వారికి విరోధముగా ఏదైనా ఒక కార్యం జరిగించి తన మనుష్యులకు డబ్బులిచ్చి మంచి పేరును చెడగొట్టటం వంటి చాలా రకములైన పనులను చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నాడు. కారణం తనకంటే గొప్ప స్థాయికి ఎవరు రాకూడదు.
కాని సంవత్సరాలు గడిచాయి అతడు వ్యాధికి గురై మిక్కిలి హీన స్థితికి వచ్చాడు. తరువాత తన తప్పును తెలుసుకొని తన పెద్ద సహోదరుని దగ్గరకు వచ్చి నేను మీకు మరియు మీ పిల్లలకు విరోధముగా అనేక కీడులను చేసాను అని చెప్పి నన్ను క్షమించమని అడిగాడు. ఆ పెద్ద సహోదరుడు దేవుడు నీ అపరాధములు క్షమించును గాక అని చెప్పి అతనిని చేర్చుకొన్నాడు.
ఇదే విధంగా పరిశుద్ద గ్రంధంలో ఇస్సాకును గూర్చి చూసినట్లయితే ఆదికాండం 26:14 ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి అని చూస్తున్నాం. 26:15లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులు అన్ని మన్ను పోసి పూడ్చేశారు అని వ్రాయబడి ఉంది. ఇలా రెండు సార్లు వచ్చి ఇస్సాకు దాసుల యొద్ద వాదించారు ఆ ఫిలిష్తీయులు. కాని వాటిని విడిచిపెట్టి మూడవసారి మరియొక బావిని త్రవ్వారు. ఇప్పుడు ఫిలిష్తీయులు వారితో జగడమాడలేదు. ఇలా ఇస్సాకుకు విరోధముగా ఫిలిష్తీయులు పగబట్టి ఇస్సాకుకు కీడును చేస్తూ వచ్చారు. కాని తరువాత ఆదికాండం 26:28-29 లో మనం చూసి నట్లయితే ఫిలిష్తీయులు ఇస్సాకు దగ్గరకు వచ్చి నిశ్చయముగా యెహోవా నీకు తోడైయున్నాడు అనియు, నీవు యెహోవా యొక్క ఆశీర్వాదం పొందిన వారు అనియు నిబంధన చేసుకొనుటకు వచ్చారు.
నా ప్రియ సహోదరి సహోదరులారా! ఒక వేళ ఇదేవిధంగా కారణం లేకుండా మీకు ప్రజలు కీడు చెయ్యవచ్చు లేదా చెడుగా మాట్లాడ వచ్చు. కాని బయపడవద్దు, కలత చెందవద్దు ఇస్సాకు వలె వారితో జగడమాడవద్దు. యెహోవా మీతో వున్నాడు అని మరియు మిమ్మును ఆశీర్వదించారు అని వారు చూసి మీ యొద్దకు వస్తారు. వారు మీ పక్షపు వారవుతారు. దాని ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించును గాక!. ఆమెన్.
- బ్రదర్. ఏ. ఇమ్మానుయేల్ గారు
ప్రార్ధన అంశం:-
మీడియా పరిచర్యలకు అవసరమైన వస్తువులు కొనుటకు ప్రార్థిద్దాం.
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250