Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 30.03.2022
Share:

By Village Missionary Movement

Wednesday, 30-Mar-2022

దిన ధ్యానము(Telugu) 30.03.2022

అంశం: చూచుచున్న దేవుడు.

"చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను" - ఆదికాండము 16: 13

ఫ్రాన్స్ దేశంలో గల బ్రమ్మాండమైన దేవాలయము నుండి ఒక శిల్పికి ఒక పని అప్పగించబడింది. అది ఏమిటి అంటే కానా ఊరిలో వివాహం జరిగే ఇంట్లో అద్బుతము కొరకు వాడబడే రాతిబానలు తయారు చేసేపని. ఆ శిల్పి ఆ శక్తితో రోజంతా రాతి బానలు చేశారు. ఇతడు చేసే పని ఆయన కుమారుడు చూస్తున్నాడు. దేవాలయమునకు శిల్పి మరియు తన కుమారుడు వెళ్ళినప్పుడు 20 అడుగుల ఎత్తులో శిల్పి చెక్కిన శిల్పం ఉంది. వెంటనే తన కుమారుడు ఇంత ఎత్తులో ఈ విగ్రహం పెట్టాలి అంటే సాధారణముగా చేసి ఉండవచ్చు అన్నాడు. వెంటనే శిల్పి తన కుమారుడితో కుమారుడా దీనిని జనులు చూస్తున్నారో లేదో గాని నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు అప్పగించబడిన పనిని నేను మనస్ఫూర్తిగా చేస్తాను అన్నాడు ఆ శిల్పి. 

అబ్రాహామునకు పిల్లలు లేనందు వలన సారా తన దాసి ఆయిన హాగరును అబ్రాహామునకు ఇచ్చింది. హాగరు అబ్రాహాము ద్వారా గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తరువాత హాగరు నన్ను నీచంగా చూస్తుంది అని సారా అనుకొని చాలా కఠినముగా హాగరును శ్రమ పెట్టింది. ఆ శ్రమలను హాగరు భరించలేక ఆ శ్రమలు నుండి తప్పించుకోవాలి అని తలంచి అక్కడ నుండి పారిపోయింది. అప్పడు దేవుని దూత అరణ్యములో శూరు కు వెళ్లే మార్గంలో హాగరును కనుగొన్నది. హాగరు యెహోవాను నేను చూసాను అని చెప్పి ఆ స్థలమునకు చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. 

అవును ప్రియమైన వారలారా! నన్ను చూచుటకు ఎవ్వరు లేరు అని అంగలార్చు చున్నారా? కలతతో దుఃఖముతో ఈ. పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? హాగరును చూసిన దేవుడు ఈ రోజు మిమ్మును కూడా చూచుచున్నాడు. మనుష్యులు మిమ్మును నీచముగా చూడ వచ్చు కాని ప్రక్కకు నెట్టివేయని దేవుడు మీ ద్వారా అదేవిధంగా గొప్ప కార్యములు చేస్తారు. హాగరు సంతతిని విస్తరింప జేస్తాను అని చెప్పిన దేవుడు వారి సంతతిని విస్తరింప జేస్తారు. అదేవిధంగా మీ ద్వారా చేయాలి అనే ప్రాణాళిక గొప్పది కాబట్టి ఆ ప్రణాళిక మీ జీవితంలో జరిగే వరకు ఓపికతో ఉండండి. ఆయన మిమ్మును చూచుచున్న దేవుడు అని మర్చిపోవద్దు. చూచుచున్న దేవుని చేతిలో సమర్పించుకొని వేచి ఉండండి దేవుడు గోప్ప కార్యములు చేస్తారు. ఆమెన్.
-    శ్రీమతి. రూతు అనిష్ గారు.

ప్రార్ధన అంశం:-
పశ్చిమ బెంగాల్ రాష్టంలో నూతనంగా పరిచర్య ప్రారంభించు లాగున ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al