Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.03.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 29-Mar-2022

దిన ధ్యానము(Telugu) 29.03.2022

అంశం: బలమైన పునాది క్రీస్తే.

"ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది" - ఎఫెసీయులకు 2:21

200 సంవత్సరాల క్రితం ఇటలీలో కట్టబడిన వంగిన టవర్ అయిన పైసా టవర్ కట్టడానికి ముందు పూర్తిగా వంగడం మొదలైయింది. దీనికి కారణం ఏమిటి అంటే చిత్తడి నేలపై కట్టడం. రెండు నదులు అక్కడ ప్రవహించడం వలన నీరు కలిగిన చిత్తడి నేలపైన పునాది వేయడమే. అందువలన బలం లేకుండా మొదటి మూడు పొరలు కట్టినప్పుడే ఆ టవర్ వంగడం మొదలైయింది. అది మాత్రమే కాదు వేయబడిన పునాది 10 అడుగుల లోతు మాత్రమే. కొద్ది కొద్దిగా వంగుతున్న ఆ టవర్ సరి చెయ్యకపోతే ఏదో ఒక రోజు కచ్చితంగా పూర్తిగా వంగిపోతుంది. ఒక భవనం యొక్క బలం అనేది పూర్తిగా పునాది మీద ఆధారపడి ఉంది. దీని కంటే ఎత్తయిన టవర్స్ మరియు భవనములు ఒంగిపోలేదు. ఎందువలన అంటే వాటి యొక్క పు నాదులు లోతుగా ఉండటం వలన మాత్రమే. 

యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతున్నారు ఆయన మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ అనే యేసుక్రీస్తు పైన తన ఇంటిని కట్టుకొనును అని. అప్పుడు ఏ తుఫాను వచ్చిన ఏ సమస్య వచ్చిన ఆ ఇల్లు దృఢంగా ఉంటుంది అది ఒంగిపోదు. బలమైన పునాది పైన వెయ్యడం వలన అది కదలదు. 

మన హృదయమైన దేవుని ఆలయం ఒక అందమైన ఇల్లు అభివృద్ధి చెందాలి అంటే అపోస్తులుల ఉపన్యాసంలో స్థిర పరచబడి క్రీస్తు అనే పునాది పైన కట్టబడాలి. ఆయన పైన కట్టబడిన ఇల్లు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మిగిలినవి క్రిందకు కూలి పాడైపోతాయి. 

ప్రియమైన వారలారా! డబ్బు పైన, అందం పైన సంబంధాల పైన, స్నేహితులు మీద కట్టబడిన ఇల్లు ఏదో ఒకరోజు సమస్యలు వచ్చినప్పుడు లేదా బలమైన కష్టాలు అనే గాలి వచ్చినప్పడు విరిగి పోతుంది. క్రీస్తే మన జీవితంలో  పునాదిగా ఉండును గాక! వేరే ఏ పునాది కూడా బలమైనది కాదు. ఆయన  పునాదిగా ఉండి కట్టబడే ఇల్లు బలమైనదిగా ఉంటుంది. అందరి ఇల్లులు అలాగే కట్టబడును గాక! సాతాను వచ్చి ఆ ఇంటిని పాడుచేసేయుటకు దారులు వెతికిన అది విరిగిపోదు, అది కదలక నిలుచును. అటువంటి విశ్వసించదగిన దేవుని పైన కట్టబడిన జీవితం వలె కదిలింపబడని ఇల్లు వలె మన జీవితమును ఉండనిమ్ము. 
-    బ్రదర్. హరీష్ శామ్యూల్ గారు

ప్రార్ధన అంశం:-
మన పరిచర్యలో ఉన్న 790 మంది సేవకుల యొక్క ఆరోగ్యం మరియు సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet