Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.03.2022
Share:

By Village Missionary Movement

Monday, 28-Mar-2022

దిన ధ్యానము(Telugu) 28.03.2022

అంశం: క్రీస్తుకి స్నేహితునిగా ఉండాలి అనుకొంటున్నావా?

"గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను" - యోహాను 15:15

ఒక అడవి ప్రాంతం నుండి ప్రమాదంలో చిక్కుకున్న ఒక వ్యక్తి స్వరం వినిపించింది. నన్ను కాపాడండి, ఈ లోయలోనుండి నన్ను రక్షించుటకు ఎవరు లేరా నేను ఇలానే చావాలా అనే శబ్దం నాలుగు వైపులా ప్రతిధ్వనించింది. ఆ మార్గంలో వచ్చిన ఒక మంచి వ్యక్తి ఈ వ్యక్తి యొక్క స్వరమును విని తన ప్రాణమును కూడా లెక్కచేయకుండా ఆ లోయలోనుండి అతనిని లేపారు. ఆ రోజు నుండి ఇద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు తరచు కలిసి మాట్లాడుకొనేవారు. కాని లోయలోనుండి లేపబడిన ఆ వ్యక్తి క్రమముగా కొనసాగించ లేకపోయాడు. ఎందుకు అనగా ఇతని మాటలు, ప్రవర్తన ఆ మంచి వ్యక్తి యొక్క ప్రవర్తనకు సరితూగలేదు. ఇందువలన ఆ వ్యక్తి ఒక మంచి స్నేహితుడ్ని కోల్పోయాడు. 

పరిశుద్ద గ్రంధంలో రాజైన సౌలు క్రమముగా ప్రవక్త అయిన సమూయేలు తో మంచి సంబంధం కొనసాగించ లేకపోయాడు. కారణం సమూయేలు యొక్క హృదయం దేవుని స్వరానికి లోబడినటువంటిది కాని సౌలు యొక్క నడవడిక మనుష్యులను సంతోష పెట్టేదిగా ఉంటుంది. 

అవును ప్రియమైన వారలారా మంచి స్నేహితులుగా ఉండాలి అంటే ఇద్దరు ఒకే విధమైన మనస్సును కలిగి ఉండాలి. లేకపోతే ఆ ఐక్యతను శాశ్వతంగా కొనసాగించడం అసాధ్యం. మనము కూడా పాపములు, అక్రమములో సాతాను వలలో చిక్కిపోయి ఉన్నాము. విడుదల దొరకక సమాధానం లేక అల్లాడి పోతున్నాం. తన ప్రాణమును కూడా లెక్క చెయ్యని యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణం ద్వారా మనం రక్షించబడ్డాం. అందువలన మనము ఆయనకు స్నేహితులమయ్యాము. ఆ స్నేహం మంచి దారిలో సాగాలి అని ఆశ పడినట్లయితే ఆయన హృదయంతో మన హృదయం సరితూగాలి. ఆయన స్నేహంతో శాశ్వతంగా సాగిపోవాలి అనుకొంటే ఆయనకు ఇష్టం లేని స్నేహములను నడవడికలను మన నుండి తీసివేయ్యాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క స్నేహంలో అందరం నిలిచి యుందుము గాక! ఆమెన్.
-    బ్రదర్. ఏ. షిమ్యోను గారు.

ప్రార్ధన అంశం:-
పబ్లిక్  ఎగ్జామ్స్  వ్రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను దేవుడు విశేష జ్ఞానంతో నింపేటట్లు ప్రార్దిద్ధాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet