By Village Missionary Movement
Sunday, 27-Mar-2022దిన ధ్యానము(Telugu) 27.03.2022 (Kid’s Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం.
అంశం:- జీసస్ కు ఏది ఇష్టం.
"అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు" - సామెతలు 12:22
హాలో పిల్లలు హౌ ఆర్ యు? అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని నమ్ముతున్నాను. యేసయ్య కు నచ్చేవిధంగా జీవించినప్పుడు యేసయ్య సంతోష పడతారు కదా. ప్రతి రోజు యేసయ్య కు నచ్చినది చేసామా అనేది మిమ్మల్ని మీరే చెక్ చేసుకోనండి సరేనా? చేస్తారు కదా సరే కధ విందమా.
బస్సులో ప్రయాణం చెయ్యడం ఎవరెవరికి ఇష్టం ? హో అందరికి ఇష్టమేనా. కిటికీ ప్రక్కన కూర్చొని ప్రకృతిని చూడటం చాలా బాగుంటుంది కదా. నలుగురు స్నేహితులు కలిసి బస్సులో ప్రయాణం చేస్తూ స్కూల్ కి వెళ్తుండేవారు. ఎప్పటి కప్పుడు ఈ నలుగురు కలిసి ఊరంతా తిరుగుతూ స్కూల్ కు లేటుగా వెళ్తుండేవారు. ఇలా చెయ్యకూడదు ఇది తప్పు కదా! స్నేహితుడు తప్పు చేసినప్పుడు గద్దించాలి కదా అదేకదా నిజమైన స్నేహం . ఒకరోజు స్కూల్ కి లేటుగా వచ్చి బస్ టైర్ పంచర్ అయ్యింది అని అబద్దం చెప్పారు ఆ స్నేహితులు. వెంటనే ఆ ఉపాధ్యాయుడు వారు చేస్తున్నది తప్పు అని వాళ్లకు తెలియజేయాలి అనుకొని విద్యార్థులు అందరిని బయటకు పంపించి ఈ నలుగురు స్నేహితులకు పేపర్లు ఇచ్చి బస్ లో ఏ టైర్ పంచర్ అయ్యిందో వ్రాయండి అని చెప్పారు. ఏం చెయ్యాలో తెలియక బిక్కు బిక్కు మని చూడటం ప్రారంభించారు. నిజాయితీగా ఉంటేనేగా వ్రాయగలరు. ఏంటి ఆ నలుగురు ఆ పేపర్ పైన ఏం వ్రాసి ఉంటారు మార్చి మార్చి తప్పులు తప్పులుగా వ్రాసి ఉంటారు అంతేగా? ఉపాద్యాయుడు నిజాన్ని కనుగొన్నారు అని ఎరిగి నలుగురు తల దించుకొని నిలబడ్డారు. వెంటనే ఆ ఉపాధ్యాయుడు వారికి ఒక సలహా చెప్పారు. నలుగురు స్నేహితులు తప్పును ఏరిగిన వారై ఉపాధ్యాయుని యొద్ద క్షమాపణ అడిగారు అప్పటి నుండి స్కూల్ కి సరైన సమయానికి రావడం మొదలుపెట్టారు. అబద్దం చెప్పడం మానేసి మంచి పిల్లల వలె నడుచుకొనుటకు ప్రయత్నం చేద్దాం అని ఆ స్నేహితులు మాట్లాడుకొనుటకు విన్న ఉపాధ్యాయుడు చాలా సంతోష పడ్డాడు.
ప్రియమైన తమ్ముడు చెల్లి అబద్దం, దొంగతనం, చెడ్డ మాటలు ఇటువంటి చిన్న చిన్న తప్పులు మీరు చేసి ఉండవచ్చు అవి యేసయ్యను బాధపెడతాయి వాటిని విడిచి పెట్టుటకు ప్రయత్నం చేసి యేసయ్యను సంతోష పరుద్దాం. ఒకే నా?
- శ్రీమతి. జీవా విజయ్ గారు
Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250