Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.03.2022
Share:

By Village Missionary Movement

Thursday, 24-Mar-2022

దిన ధ్యానము(Telugu) 24.03.2022

అంశం:-  బలత్కారము చేయుట.

"పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు" - మత్తయి 11:12

ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిస్టాల్ నగరమునకు చెందిన దేవుని సేవకుడు అయిన జార్జ్ ముల్లర్ అమెరికాకు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ఓడ నావికుడు ఉత్తమ క్రైస్తవుడు మరియు ముల్లర్ కు స్నేహితుడు కూడ. సముద్రంలో ఏ ఆటంకము లేకుండా వెళుతున్న ఓడ హఠాత్తుగా వచ్చిన అధిక పొగమంచు కారణంగా నిలిచిపోయింది. జార్జ్ ముల్లర్ శనివారం మధ్యాహ్నం లోపు అమెరికాలో ఉన్న క్యూబిక్ నగరంలో ఉండాలి అని అన్నారు. అది జరగని పని ఎందుకు అంటే మన ప్రయాణమును ఆటంకము పరుస్తున్న పొగమంచు ఎంత దట్టమైనదో తెలుసా అని అన్నారు ఆ ఓడ కెప్టెన్. ముల్లర్ మాత్రము నా కన్నులు కెప్టెన్ పైన కాదు నా జీవితంలో సమస్త కార్యములు జరిగిస్తున్న జీవముగల దేవుని పైన ఉన్నాయి అని చెప్పి వెంటనే మోకరించి దేవుడు అద్భుతం చేయు లాగున కెప్టెన్ తో కలిసి ప్రార్ధించారు. ప్రార్ధన అయిపోయిన తరువాత ఇద్దరు వెళ్లి ఓడ ముందు చూసినప్పుడు పొగ మంచు పూర్తిగా తొలగిపోయి ఉంది. సరైన సమయానికి పరిచర్యను నేరవేర్చుటకు అమెరికాకు చేరుకున్నారు ముల్లర్.

పరిశుద్ద గ్రంధంలో దేవుని కృపను పొందుకున్న ఇద్దరు వ్యక్తులు గురించి మనం ధ్యానిద్దాం. న్యాయాధిపతిని బలవంతం చేసిన విధవరాలు న్యాయాన్ని పొందుకొన్నది (లూకా సువార్త 18:1-7) లో మనం చూడగలం. దేవునికి బయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉన్న న్యాయధిపతి విధవరాలను పట్టించుకోలేదు కాని ప్రతి రోజు ఆ విధవరాలు న్యాయాధిపతిని విడువక తొందర పెట్టుచు బలవంతము చేసి న్యాయమును ఆ న్యాయాధిపతి నుండి పొందుకొన్నది. 

పాత నిబంధనలో మన పూర్వపు తండ్రి అయిన యాకోబు కూడా యెహోవాతో పోరాడి ఆయనను బలవంతం చేసి నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నేను నిన్ను పోనివ్వను అని చెప్పి దేవుని నుండి ఆశీర్వదాం పొందుకున్నాడు. ఇంకా  బలత్కారులు పరలోక రాజ్యమును అక్రమించు కొనుచున్నారు అని
 యేసుక్రీస్తు చెప్పుట మనం చదువుతున్నాం. మనము కూడా యాకోబు వలె, జార్జ్ ముల్లర్ వలె ప్రార్ధనలో పోరాడి విజయమును పొందుకుందాం. అన్నిటికంటే ముఖ్యం అయిన మన లక్ష్యంగా ఉన్న పరలోకమును మనము చేరుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమెన్!
-    శ్రీమతి. జాస్మిన్ పౌలు గారు.

ప్రార్ధన అంశం:-
మోక్ష ప్రయాణం, దిన ధ్యానమును వ్రాసి అందజేస్తున్న వ్యక్తులు దేవుని ఆత్మచేత నడిపించబడేటట్లు ప్రార్దిద్ధాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet