Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.01.2021
Share:

By Village Missionary Movement

Friday, 22-Jan-2021

దిన ధ్యానము(Telugu) 22.01.2021

మనస్సు ఉంటే చోటు ఉంది:

"పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి" - రోమీయులకు 12: 13

ఒక గ్రామంలో ఇద్దరు పెద్దవాళ్ళు పక్క పక్క ఇంట్లో జీవించేవారు. ఒక రోజు రాత్రి ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, చినిగిపోయిన వస్త్రములతో వచ్చి తలుపును కొట్టి  ఆకలి వేస్తుంది అన్నారు. మొదటి ఇంటి వారు ఏమి లేదు అని చెప్పి పంపించేశారు. రెండవ ఇంటిలో గల పేదవాడు అతనికి కొద్దిగా ఆహారము, పడుకొనుటకు కొద్దిగా స్థలము ఇచ్చారు. మరుసటి ఉదయమునే మంచి విశ్రాంతి తీసుకొని లేచిన ఆ వృద్ధుడు ఆ ఇంటి వారికి ఒక పాత సంచి ఇచ్చి వెళ్లారు. ఆ సంచిలో రెండు బంగారు నాణెములు ఉన్నాయి. వాటిని అమ్మి వ్యాపారము చేసి నెమ్మదిగా ఆశీర్వాదం పొందుకొని సంతోషంగా జీవించాడు ఆ ఇంటివారు. 

బైబిల్లో మనము చూసిన యెడల అబ్రాహాము మంచి ఉపచారము చేసిన వ్యక్తిగా ఉంటున్నారు అని అదికాండం 18:2,4 చెప్పబడి ఉంది. వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి  మీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు మీ దాసుని దాటిపోవద్దు కొంచెము నీళ్లు తెప్పించెదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోనుడి మిమ్మును బలపరుచుటకు కొంచము ఆహారము తెచ్చెదను తరువాత మీరు వెళ్లవచ్చు అని చెప్పి మూడు మానికల మెత్తని పిండితో రొట్టెలు చేసి లేత దూడను తెచ్చి వాళ్లకు విందు చేశారు. వారు ఆ ఆహారమును భుజించిన తరువాత వారు అబ్రాహామును దీవించారు. తరువాత అబ్రాహాము, శారా ఎదురుచూస్తున్న పుత్ర భాగ్యము అనే దీవెనెను పొందుకున్నారు. సంతానము లేకుండా వాళ్ళ యొక్క జీవితంలో సంతోషం లేకపోవచ్చు దేవుడు అయితే ఇస్సాకు అనే సంతోషాన్ని వాళ్లకు దయ చేశారు. 

ఈ దినము వరకు కూడా మనము ఇతరుల యొద్ద నుండి ప్రత్యుపకారము ఆశించకుండ సహాయము చేసే గుణము మనకు అవసరమై ఉంది. వీళ్లకు సహాయము చేస్తే నాకు ఏమి దొరుకుతుంది, నా ఇంటి అవసరతలు కొరకు నేను పెట్టుకున్న దానిని వీళ్ళు కొరకు ఖర్చు చేయాలా అని ఆలోచించిన యెడల మనము ఎవరికి సహాయము చేయలేము. కాని ఇతరులకు సహాయము చేయాలి అనే మనస్సు ఉండిన యెడల దేనిని కూడా లెక్క చేయము. దానిని చూస్తున్న ప్రభువు ఖచ్చితంగా మనలను దీవిస్తారు. పేదరికం మధ్యలో కూడా ప్రవక్తను పోషించిన సారేపతు విదవరాలు ఇంట్లో గల పిండి ,నూనె తగ్గిపోకుండా సంపూర్ణంగా దీవించిన వాడు మీ జీవితంలో కూడా సంపూర్ణ దీవెనెను దయ చేస్తారు.
-    బ్రదర్. ఆల్విన్ జాకబ్.

ప్రార్థన అంశం:-
ఒడిశా రాష్ట్రంలో గుమ్మ అనే ప్రాంతంలో నూతనంగా పరిచర్యను ప్రారంభించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet