Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 15.03.2022
Share:

By Village Missionary Movement

Tuesday, 15-Mar-2022

దిన ధ్యానము(Telugu) 15.03.2022

అంశం:-  మోకాళ్ళ బలం.

"అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను" - మార్కు 11:24

ఒక మిషనరీ తను సేవచేయుటకు పంపబడిన సేవా స్థలానికి ఆసక్తితో వెళ్ళి సేవను ప్రారంభించాడు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఈయన చెప్పే సువార్తను వినుటకు ఎవ్వరు ఆసక్తి చూపకుండా  మొండివారివలె నా ఇష్ట ప్రకారంగా  నేను ఉంటాను అనే టటువంటి వారివలె ఉన్నారు. విశ్రాంతి లేకుండా సేవచేస్తున్నా సరే కొంతమంది కూడా రక్షింపబడకుండా ఉండటంవలన నేను చేసిన ప్రయత్నములన్నీ వ్యర్ధమవుతున్నాయి అని అనుకొని బాధతో కృంగి పట్టణము యొక్క వేరే స్థలానికి వచ్చారు ఆ సేవకుడు. అక్కడ త్రోవపక్కన రాళ్ళను పగులగొట్టే ఒక వ్యక్తిని చూసారు ఆ సేవకుడు. ఆ వ్యక్తి పెద్ద పెద్ద రాళ్ళను సుత్తితో పగలగొడుతూ ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళిన సేవకుడు అయ్యా ఇంతపెద్ద రాళ్ళను మీరు ఎలా పగులకుడుతున్నారు అని అడిగాడు. అందుకు ఆ రాళ్ళను పగులగొడుతున్న అతను అయ్యా!  అంతపెద్ద రాళ్ళను పగులగొట్టేటప్పుడు మోకాళ్ళ పై నిలబడి పగులగొట్టాలి. మోకాళ్ళ పై నిలబడి కొట్టినప్పుడు ఎంతపెద్ద రాళ్ళనైనా, ఎంత గట్టిన ఉన్నా సులభముగా కొట్టగలము. అతని ద్వారా దేవుడు తనతో మాట్లాడుటను ఒక్కక్షణం లో అర్ధం చేసుకున్నాడు ఆ సేవకుడు.సంతోషం గల మనసుతో తిరిగి ఇంటికి వెళ్ళి ఆ రోజు నుండి చాలా సమయం సేపు మోకాళ్లపై నిలబడి విజయం సాధించారు. మోకాళ్లపై నిలబటుయే విజయం యొక్క రహస్యం. 

పరిశుద్ధ గ్రంధ లో దానియేలు, ఏలియా, పౌలు, ఎస్తేరు వీరందరూ విజయమును చూచినవారు. మనము కూడా మోకాళ్లపై నిలబడి హృదయమును అర్పించినప్పుడు అధికమైన బలమును పొందుకొనగలము. మీ జీవితంలో కలిగిన ఓటమిని చూసి కృంగిపోయి ఉన్నారా? ఎంత ప్రయత్నించినా  ఏ ఒక్క మార్పు కూడా లేదు అని కన్నీరు కారుస్తున్నారా? మీ మోకాళ్ళను వంచండి. విజయం కొరకు ఎంత ప్రయత్నం చేసినా ఆ విజయానికి ఆజ్ఞ ఇచ్చిన వాడు మనప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.     మన జ్ఞానముతో సాధించలేనివి మోకాళ్ళతో సాధించగలం. మీరు మీ యవ్వన పిల్లల యొక్క మొండితనం మారాలని అనేక ఆలోచనలు చెప్పేవారా? అయితే మీకు ఒక ఆలోచన వ్యక్తిగతంగా మోకాళ్ళు వేయండి మీ కన్నీటికి మోకాళ్ళ ప్రార్ధనకు కచ్చితముగా జవాబు కలదు. 

ప్రియమైన సేవకులారా! నేను ఎన్ని సంవత్సరములు సేవచేసాను? కాని ఒక ఫలితం కూడా లేదు కాని ఇంతవరకు నేను చేసిన ప్రయత్నంనకు  ఏ ఒక్క ఫలితం లేకుండా పోయిందని సణుగు కొనుచున్నారా దేవునికొరకు చేసే ఏ ఒక్క చిన్న పనిఅయినా వ్యర్థం కాదు అని మనస్ఫూర్తిగా నమ్మండి . కాని ఏమి చేసినా మోకాళ్ళ పై నిలబడి చేసి చూడండి ఖచ్చితంగా పంట యొక్క విస్తారమైన కోతను చూస్తారు. ఆమెన్. 
-    సహోదరుడు. హరీష్ సామువెల్ గారు 

ప్రార్ధనా అంశం:-
హాస్పిటల్ పరిచర్యలు స్కూల్ మిషన్ పరిచర్యలు అన్నీ ఆటంకం లేకుండా జరుగుటకొరకు నూతన ద్వారములు తెరవబడుటకొరకు ప్రార్దిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet