Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.03.2022
Share:

By Village Missionary Movement

Monday, 14-Mar-2022

దిన ధ్యానము(Telugu) 14.03.2022

అంశం:-  టికా

"నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు" - కీర్తనలు 91:10

జాన్. జి. ఎలెక్ అనే సేవకుడు ఒక విధమైన  రోగము ప్రాకుతున్న కాలములో హాస్పిటల్ కు వెళ్లి రోగుల కొరకు ప్రార్ధించి వచ్చారు. దానిని చూసిన వైద్యులు ఆయనను పిలిచి మీరు ఈ కఠోరమైన రోగుల తలల మీద చేతులుంచి ప్రార్ధన చేస్తున్నారు మరి ఆ రోగము మిమ్మల్ని అంటుకోదా, మీరు టీకా వేసుకొని యున్నారా అని ప్రశ్నించారు. అందుకు ఆ సేవకుడు అవును నేను టీకా వేసుకొని యున్నాను అని జవాబు చెప్పాడు. వైద్యులు మీరు ఎలాంటి టీకా వేసుకొని యున్నారు అని అడిగినప్పుడు దానికి జవాబుగా నేను క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. రోమియులకు వ్రాసిన పత్రిక 8:2 అనే టీకా వేసుకొని యున్నాను అన్నారు. మరి ఈ సేవకుడు వేసుకున్న టీకా ఏమిటి? పాప మరణముల నియమముల నుండి విడిపించ గలిగిన నియమము అనే టీకా.

మనము బైబిల్లో చూసిన యెడల ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో బానిసలుగా వుండేటప్పుడు ఇశ్రాయేలియుల మధ్యలో అనేక తెగుళ్లు వచ్చాయి. కాని అవి ఏవి కూడా ఇశ్రాయేలీయులకు హాని కలిగించ లేదు. ఎందుకంటే దేవుని పైన ఆనుకొనేవారికి ఆయనే కోటగాను, దాగు చోటుగాను, ఆశ్రయ దుర్గము గాను మరియు నీడగాను ఉన్నారు. అప్పుడు మాత్రమే కాదు ఈ దినము కూడా అలాగే వుంటున్నారు. 

ప్రభువు నందు ప్రియమైన వారలారా! ఈ దినము అనేక విధములైన రోగములు విస్తారముగా ఉన్నప్పటికీ అవి ఏవీ మనలను అధిగమించవు. ఎందుకంటే మనం వేసుకున్న టీకా అలాంటిది. ఒకడు క్రీస్తు నందు ఉంటేనే తప్ప ఈ టీకా పని చెయ్యదు. క్రీస్తు లో లేకుండా బయట ఉన్న వాళ్లకు ఎలాంటి గ్యారంటీ లేదు మీరు ఇప్పుడే నా యొద్దకు రండి అని యేసు పిలుస్తున్నారు. మీ యొక్క అంతరంగ పాపములను విడిచి మారు మనస్సు పొంది ఆయన యొద్దకు రావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆయన కొరకు మిమ్మల్ని సమర్పించు కొనిన యెడల నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్.
-    బ్రదర్. పి.శివ

ప్రార్ధన అంశం:-
ప్రార్ధన గుడార కట్టడ పనులలో పనిచేస్తున్న వారి యొక్క సంరక్షణ కొరకు, వారి యొక్క కుటుంబాలు దీవించబడేటట్లు ప్రార్దిద్ధాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet