Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.03.2022
Share:

By Village Missionary Movement

Saturday, 12-Mar-2022

దిన ధ్యానము(Telugu) 12.03.2022

అంశం:-  నీకు ఏమి కావలెను.

"...మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును" - మత్తయి 6:33

పరిశుద్ద గ్రంధం మనము చదివినప్పుడు యెహోవా ఇద్దరు వ్యక్తులతో నీకు ఏమి కావలెను అని అడిగారు. వారు చెప్పిన సమాధానం దేవునికి చాలా ఇష్టంగా ఉంది. అందులో మొదటి వ్యక్తి సోలోమోను. సొలొమోను ఒక  రాజుగా ఉన్న కాలంలో దేవుడు ఆయన బలులను అంగీకరించి తన స్వప్నమందు ప్రత్యేక్షమై నేను నీకు దేనిని ఇచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగమని సెలవిచ్చారు. అతను అనుకొంటే సంపాదన, రాజ భవనము, ఇతర రాజ్యములు అనేవాటిని కావాలి అని అడగవచ్చు కాని సొలొమోను నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయం దయచేయుము అని అడిగాడు. అది దేవునికి ప్రియముగా ఉండటం వలన అతడు అడిగిన వివేకముతో సహా సంపద, విలువైన అన్నింటినీ ఇచ్చారు. 

రెండవ వ్యక్తి మోషే. మోషే నోటి మాంద్యము, నాలుక మాంద్యము గల వాడు. యెహోవా దేవుడు తనతో మాట్లాడినప్పుడు అతడు తనకు ఉన్న శరీర సంబంధమైన లోటు మారాలి అని లేదా వేరే లోక సంబంధమైన ఆశీర్వదములు కావాలి అని అడుగక దయ చేసి నీ మహిమను నాకు చూపుము అని దేవుడు మెచ్చుకొనేలా ఒక కోరిక కోరాడు. దేవుడు తన కోరిక మంచిది అని చూసి వెంటనే మోషేకు ఆయన కనిపించాలి అని ప్రత్యక్ష పరుచుకొన్నారు. అంతవరకు జరుగని అద్బుతములు, ఆశ్చర్య కార్యములు , గొప్ప గొప్ప కార్యములు జరిగేలా దేవుడు అతనిని వాడుకున్నారు. 

దీనిని చదువుతున్న ప్రియమైన దేవుని పిల్లలారా! మనం ఈ రోజు మనలను మనమే పరీక్షించి చూసుకుందాం. ప్రభువు మన దగ్గరకు వచ్చి ఈ ప్రశ్నను అడిగినప్పుడు మన జవాబు ఏ విధంగా ఉంటుంది? లోక సంబంధమైన ఆశీర్వాదములనా కాదు. యెహోవా దేవునికి ప్రియమైన, ఆయన నామము మహిమపరచదగిన, ఆయన సంతోష పరచదగిన విషయములను అడుగుదాం. పరిశుద్ద గ్రంధం సెలవిస్తుంది ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి అప్పడు అవన్నియు మీకు అనుగ్రహించబడును అని. అందువలన దేవుని రాజ్యమును మొదట వెతుకుదాం, ఆయనను సంతోష పరుద్దాం. ఆమెన్.
-    బ్రదర్. చందన పాండి గారు

ప్రార్ధన అంశం:-
ప్రార్ధనా గుడారపు కట్టడ పనులు త్వరగా జరిగేలా మరియు దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠితం చేయబడేలా ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet