Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 11.03.2022
Share:

By Village Missionary Movement

Friday, 11-Mar-2022

దిన ధ్యానము(Telugu) 11.03.2022

అంశం:-  గుణవతి అయిన స్త్రీ.

"...వారందరిలొ నీవు మించినదానవు ...." - సామెతలు 31:29

సహోదరి భువనా ధనబాలన్ గారి తల్లి గడచిన జనవరి నెల 15వ తేదీన ప్రభువులో నిద్రించారు. ఆమెను గూర్చిన కొన్ని విషయాలు దేవుని మహిమ కొరకు పంచుకోవాలి అని ఆశ పడుతున్నాను. ఆ తల్లి క్రీస్తుని ఎరుగని కుటుంబంలో పుట్టిన వారు. కాని పరిశుద్ద గ్రంధం సెలవిచ్చిన గుణవతి అయిన స్త్రీ కి ఉండవలసిన చాలా మంచి గుణములు ఆమెలో చాలా ఉండేవి. ఓర్పు, సహనం, ప్రేమ, విధేయత వంటి వాటిలో ఒక ఉదాహరణగా ఉండేవారు. తన తల్లిదండ్రులు ఆమె కళ్ళముందు ఏ ఒక్కరోజు కూడా గొడవ పడేవారు కాదు. బిడ్డలను ప్రేమగా పెంచారు. ఆ సహోదరి కలశాల విద్య సమయంలో యేసుని అంగీకరించారు. ఆమె తల్లికి కూడా యేసయ్య గురించి తెలియపరిచారు కాని భర్త మాటను ఎదురించలేక ఆమె యేసుని అంగీకరించలేదు. ఒక రోజు ఆ సహోదరి యొక్క అక్క ప్రసవ సమయంలో తన తల్లి పరిస్థితిని బట్టి ఒంటరిగా ఉత్తర భారత దేశమునకు వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ సదుపాయం లేని ఆ రోజుల్లో తన తల్లి యొక్క చిన్న ప్రార్ధన ఆమెను భద్రంగా వాళ్ళ అక్క ఇంటికి చేర్చింది. ప్రభువా నా కుమార్తె ప్రసవమునకు సరైన సమయంలో సరైన స్థలమునకు నన్ను చేర్చుము అని ప్రార్ధించారు. తమిళ్ తప్ప వేరే భాష తెలియని నా తల్లి యొక్క ప్రార్ధనకు దేవుడు పంపిన జవాబు ఆమె ప్రభువును అంగీకరించుటకు కారణం అయ్యింది. 

తరువాత 1882వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె తన సొంత ఊరిలోనే బాప్తిస్మము పొందుకొన్నారు. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు తన తల్లిని చాలా రకములైన మరణ బంధకముల నుండి తప్పించి చక్కగా నడిపించి 94 సంవత్సరాల అయుస్సును ఆమెకు ఇచ్చారు. తన తల్లిదండ్రులను, భర్తను, కొడళ్లను ఆమె మరణపు అంచులలో ఆమె ప్రేమతో సంధించారు. ఎప్పుడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం, లోటుపాటులను చెప్పడం లాంటివి ఏమియు చెయ్యలేదు. సంఘమునకు వెళ్లుటలో మిక్కిలి ఆశక్తిగా వెళ్లేవారు. తన మరణపు అంచులలో కూడా ఏ ఒక్కరోజు ఆమె సణుగుకొనలేదు. అవును తన తల్లి యొక్క జీవిత కాలంలో తన పిల్లలకు ఈ విధంగా ఉండాలి అని బుద్ధులు చెప్పలేదు. బదులుగా గుణవతి అయిన స్త్రీ వలె జీవించి చూపించారు. మనము కూడా వేకువజామున దేవున్ని వెతకడం, బీదలకు సహాయం చెయ్యడం తమ తమ ఇంటి పనులను చక్కగా సర్దిపెట్టడం, భర్తకు కిరీటంగా ఉండడం వంటి అన్ని మంచి గుణములు మన దగ్గర కనిపించేలా ప్రార్ధనతో ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనం కూడా ప్రాణం ఉన్నంత వరకు గుణవతి అయిన స్త్రీ వలె, భర్త పిల్లల ద్వారా ధన్యురాలు అని ప్రసంసించ దగిన స్త్రీ వలె జీవించడానికి దేవుడు కృప చూపును గాక! ఆమెన్.
-    శ్రీమతి. భువనా ధనబాలన్ గారు

ప్రార్ధన అంశం:-
బైబిల్ కాలేజ్ కు దేవుని చిత్త ప్రకారమైన వ్యక్తులు వచ్చి శిక్షణ పొందుకొనేల ప్రార్థిద్దాం.

Whatsapp
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు +91 94440 11864 అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet